అనసూయ ఐటెం కాదట

అనసూయ ఐటెం కాదట

బుల్లితెర ఛబ్బీ బ్యూటీ అనసూయ ఫ్యాన్స్ పై మండిపడుతోంది. నన్ను అంత మాట అంటారా అని కస్సుమంటోంది. జబర్దస్త్ లో హొయలొలికించినా, నాగ్ తో సరసాలాడినా, బుల్లితెరపై ఏ డేట్ విత్ అనసూయ అని ప్రోగ్రామ్ చేసినా.. అనసూయ అనసూయే.
         
ఇంతకీ అనసూయకి కోపమెందుకొచ్చిందంటే.. అనసూయను ఓ అభిమాని ఐటెం అన్నాడట. సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ విన్నర్ లో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ..ఆ మూవీ ప్రమోషన్ కోసం ఆన్ లైన్ ఛాట్ షో చేసింది. అప్పుడు లైన్లోకొచ్చిన అభిమాని మీ ఐటెమ్ ఎలా వచ్చిందని అడిగాడట.
         
అంతే అప్పటిదాకా కూల్ గా సమాధానం చెప్పిన అనసూయ్.. యమ సీరియస్ అయిపోయింది. అసలే అమ్మడికి సోగ్గాడే చిన్నినాయనా రూపంలో షాక్ తగిలింది. ప్రాధాన్యం గల పాత్ర అని చెప్పి.. ఐటెమ్ కు తక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ లాంటి పాత్రిచ్చారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తననే ఐటెమ్ అనడంతో.. అమ్మడికి గత చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో.
      
ఐటెం అంటే వస్తువని ఆడవాళ్లు ఐటమ్స్ కాదని, వాటిని స్పెషల్ సాంగ్స్ అనాలని క్లాస్ పీకింది. ఇక్కడ అనసూయ మరో శతాబ్దపు జోక్ కూడా పేల్చిందండోయ్. అదేంటంటే మన ఆనందం కోసమే అనసూయ స్పెషల్ సాంగ్స్ చేస్తోందట. అంటే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తోందా ఏమిటీ కొంపతీసి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు