అక్కడ వంద కోట్లు.. ఇక్కడ ఎంత తెస్తుందో?

అక్కడ వంద కోట్లు.. ఇక్కడ ఎంత తెస్తుందో?

వంద కోట్ల గ్రాస్ అన్నది తెలుగు సినిమాలకు చాలా చిన్న విషయం. ఈ మార్కును మన సినిమాలు చాలా ఏళ్ల కిందటే దాటేశాయి. ఐతే మలయాళ సినిమాకు మాత్రం ఇది చాలా పెద్ద విషయం. తొలిసారిగా ఈ ఏడాదే సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ ఘనతను అందుకున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కిన 'పులి మురుగన్' రెండు నెలల కిందట రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. 100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మలయాళ సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడీ చిత్రం తెలుగులో 'మన్యం పులి' పేరుతో విడుదల కానుంది. పెద్ద నోట్ల రద్దుతో తెలుగు సినిమాల జోరు తగ్గిన నేపథ్యంలో డిసెంబరు 2న కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

మనమంతా.. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాడు మోహన్ లాల్. 'మన్యం పులి'లో జగపతి బాబు విలన్ పాత్ర పోషించడం విశేషం. హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా మనకు బాగానే పరిచయం. 'మన్యం పులి' ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. వైశాఖ్ రూపొందించిన ఈ చిత్రంలో మోహన్ లాల్.. సింహాల్ని వేటాడే వీరుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా అంతా దాదాపుగా అడవుల్లోనే సాగుతుంది. దట్టమైన కేరళ అడవుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి మలయాళంలో వంద కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. తెలుగులో ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English