చంద్రశేఖర్ యేలేటితో నాగచైతన్య?

చంద్రశేఖర్ యేలేటితో నాగచైతన్య?

చంద్రశేఖర్ యేలేటి సినిమాల్లో కొన్ని బాగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ఆయన కెరీర్లో వేస్ట్ అనదగ్గ సినిమా ఏదీ ఉండదు. కమర్షియల్‌గా ఎలాంటి ఫలితాన్నందుకున్నా.. యేలేటి ప్రతి సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఆయన లేటెస్ట్ మూవీ 'మనమంతా' కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల.. ఇంకొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆడలేదు కానీ.. 'మనమంతా' గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఫలితం గురించి పట్టించుకోకుండా యేలేటి తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్టు తీర్చిదిద్దుకునే పనిలో పడిపోయాడు.

యేలేటి తన తర్వాతి సినిమాను అక్కినేని నాగార్జునతో చేయాలని ప్రయత్నించాడు. ఐతే తన దగ్గరికి వచ్చే టాలెంటెడ్ డైరెక్టర్లను కొడుకు నాగచైతన్య దగ్గరికి పంపే అలవాటున్న నాగ్.. యేలేటిని కూడా చైతూకు అటాచ్ చేసినట్లు సమాచారం. యేలేటి-చైతూ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని 'మనమంతా' తీసిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటే నిర్మించవచ్చట. ఐతే ఆ బేనర్‌కు చైతూ ఇంకో కమిట్మెంట్ ఇచ్చాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమా పూర్తి చేశాక యేలేటి సినిమా చేస్తాడా.. లేక ముందు యేలేటితో చేశాక ఇంద్రగంటి సినిమాను మొదలుపెడతాడా అన్నది క్లారిటీ లేదు కానీ.. యేలేటితో సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English