బూతు సినిమాలో నితిన్‌ హీరోయిన్‌!

బూతు సినిమాలో నితిన్‌ హీరోయిన్‌!

ఇది సెక్స్‌ కామెడీ కాదంటూ అవసరాల శ్రీనివాస్‌ ఎంత నమ్మబలుకుతున్నా, హంటర్‌ అనేది బూతు కామెడీనే అనేది జగమెరిగిన సత్యం. బాలీవుడ్‌లో పదుల కొద్దీ వచ్చి పడిపోతున్న అనేకానేక సెక్స్‌ కామెడీల్లో హంటర్‌ కూడా ఒకటి. కాకపోతే చెప్పే బూతు విషయాన్నే పద్ధతిగా చెప్పడం వల్ల అదో కల్ట్‌ ఫిలిం అయింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నీతి చెప్పాలంటూ ఆ సినిమాని టోన్‌ డౌన్‌ చేసినట్టయితే ఇక రీమేక్‌ చేసుకోవడం అనవసరం. బహుశా తన ఇమేజ్‌ దెబ్బ తింటుందేమోననే భయంతో ఈ చిత్రాన్ని బోల్డ్‌గా అభివర్ణించడానికి అవసరాల శ్రీనివాస్‌ జంకుతున్నాడేమో. ఇదిలావుంటే ఇందులో ప్రధాన కథానాయికగా మిష్టీ చక్రవర్తి నటిస్తోంది. ఇంతకీ ఆవిడెవరంటారా? నితిన్‌, కరుణాకరన్‌ల 'చిన్నదాన నీకోసం' చిత్రంలో నటించిన మిష్టీ ఇందులో అవసరాలకి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్లలో మిష్టీ పెదాలనే వాడుకుంటున్నారు. ఇందులో ఆమెతో పాటు తేజస్వి, శ్రీముఖి కూడా నటిస్తున్నారు. అయితే వీరిలో ఎవరికి హాట్‌ పాత్రలు దక్కాయో, ఎవరిని పద్ధతిగా చూపిస్తున్నారో అనేది సినిమా విడుదలైతేనే కానీ తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు