తమన్నా ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి?

తమన్నా ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి?

గత ఏడాది 'బాహుబలి' లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్లో నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ఏడాది సమ్మర్లో వచ్చిన తమన్నా మూవీ 'ఊపిరి' కూడా మంచి విజయమే సాధించింది. ఈ రెండు సినిమాలూ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కూడా. ఆమె క్రేజ్ కూడా బాగా పెరిగింది. అయినప్పటికీ తమన్నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఓవైపు తెలుగులో స్టార్ హీరోలందరూ హీరోయిన్ల కొరతతో ఇబ్బంది పడుతుంటే తమన్నాకు టాలీవుడ్లో అవకాశాలే లేకపోవడం విడ్డూరం. ఆమెను ఇక్కడి ఫిలిం మేకర్స్ వద్దనుకుంటున్నారా.. లేక తనే ఇక్కడి సినిమాలు ఒప్పుకోవట్లేదా అన్నది అర్థం కావడం లేదు.

ఇలాంటి టైంలో తమన్నా ఒక ఆసక్తికర విషయం చెప్పింది. కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో తాను నటించనున్నట్లు వెల్లడించింది. ''దురదృష్టవశాత్తూ నేను నా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఐతే త్వరలోనే ఆ సినిమాల వివరాలు వెల్లడవుతాయి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ సినిమాల్లో నేను నటిస్తున్నందుకు నా అభిమానులతో పాటు అందరూ చాలా సంతోషిస్తారు" అని తమన్నా పేర్కొంది. చూస్తుంటే తన పనైపోయిందంటూ సెటైర్లు వేస్తున్న వాళ్లకు సమాధానం ఇచ్చేలా కనిపిస్తోంది తమన్నా. తెలుగులో సినిమాలు మానేసినా.. తమిళంలో మాత్రం తమన్నా కత్తి సెండై {ఒక్కడొచ్చాడు}తో పాటు మరో సినిమాలోనూ నటిస్తోంది. మరి తమన్నా అనౌన్స్ చేయబోయే సినిమాలు తెలుగువేనా.. లేక తమిళ ప్రాజెక్టులో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు