కొత్త సినిమా పోస్ట‌ర్లు అదుర్స్‌

కొత్త సినిమా పోస్ట‌ర్లు అదుర్స్‌

చాన్నాళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో (త‌మిళంలో అచ్చం ఎన్బ‌దు మ‌ద‌మాయిడ‌) ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డం గౌత‌మ్ మీన‌న్‌కు పెద్ద రిలీఫే. తెలుగులో ఓ మోస్త‌రుగా ఆడిన ఈ చిత్రం త‌మిళంలో మాత్రం మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఈ ఉత్సాహంలో త‌న త‌ర్వాతి ప్రాజెక్టుల‌పై దృష్టిపెట్టాడు గౌత‌మ్. ధ‌నుష్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కిస్తున్న 'ఎన్నై నొక్కి పాయుమ్ తోట' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశాడు గౌత‌మ్. ఆ పోస్ట‌ర్లు సింప్లీ సూప‌ర్బ్ అనిపించాయి. సోష‌ల్ మీడియాలో ఇన్‌స్టంట్‌గా హిట్ట‌యిపోయి వైర‌ల్ అయిపోయాయి ఈ పోస్ట‌ర్లు.

ఒక పోస్ట‌ర్లో నున్న‌టి షేవ్‌తో టీనేజ్ కుర్రాడిలా ఉన్న ధ‌నుష్‌.. మ‌రో పోస్ట‌ర్లో గ‌డ్డంతో ర‌ఫ్‌గా మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మ‌రో పోస్ట‌ర్లో హీరోయిన్ మేఘా ఆకాశ్‌తో రొమాన్స్ చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చాడు. మూడు పోస్ట‌ర్లూ ఆహ్లాద‌క‌రంగా ఉన్నాయి. గౌత‌మ్ ముద్ర‌ను చూపిస్తున్నాయి. హీరో క్యారెక్ట‌ర్లను ర‌స‌వ‌త్త‌రంగా తీర్చిదిద్ద‌డంలో స్పెష‌లిస్టు అయిన గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మంచి న‌టుడైన ధ‌నుష్ న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ‌వుతుంది. వ‌చ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇందులో క‌థానాయిక‌గా నటిస్తున్న మేఘా.. ఆల్రెడీలో తెలుగులో నితిన్‌, అఖిల్ సినిమాల‌కు క‌థానాయిక‌గాఎంపిక‌వ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు