'బేతాళుడు'కు రాసిచ్చేశారుగా..

'బేతాళుడు'కు రాసిచ్చేశారుగా..

వాయిదా పడితే పడింది కానీ.. మంచి టైమింగ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విజయ్ ఆంటోనీ సినిమా 'బేతాళుడు'. ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు నవంబరు 18నే వచ్చినట్లయితే నిఖిల్ మూవీ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో పోటీ పడాల్సి వచ్చి ఉండేది. ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే కాబట్టి 'బేతాళుడు'కు దెబ్బ పడేది. ఇప్పుడు డిసెంబరు 1న కింగ్‌‌లాగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తోందీ సినిమా. అప్పటికి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' జోరు తగ్గిపోతుంది. ఇక లాస్ట్ వీకెండ్లో వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా', 'రెమో' ఓ మోస్తరు కలెక్షన్లతో సాగుతున్నాయి. అవి కూడా రెండో వారానికి నెమ్మదిస్తాయి.

ఈ రాబోయే వీకెండ్లో 'బేతాళుడు'కు పోటీ ఇచ్చే సినిమాలేవీ రావట్లేదు. సాయిరాం శంకర్ సినిమా 'అరకు రోడ్‌లో' మీద హైప్ లేదు. ఖాళీ దొరికింది కాబట్టి ఏదో నామ్ కే వాస్తే రిలీజ్ చేస్తున్నట్లే ఉంది. మరోవైపు మోహన్ లాల్ సినిమా 'మన్యం పులి' కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశాల్లేవు. విజయ్ ఆంటోనీ లాస్ట్ మూవీ 'బిచ్చగాడు' బ్లాక్ బస్టర్ హిట్టవడం.. 'బేతాళుడు' కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువారమే సినిమాను రిలీజ్ చేసి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజిని కూడా వాడుకోవాలని నిర్ణయించారు. కాబట్టి రాబోయే వీకెండ్లో 'బేతాళుడు' హవా సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English