గెస్ట్ రోల్ కాదు హీరోనే అంటున్న నాగ్

గెస్ట్ రోల్ కాదు హీరోనే అంటున్న నాగ్

యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తాడంటే చాలామందికి నమ్మకం కలగలేదు. ఒకవేళ ఈ సినిమా ఉన్నా.. ఇందులో నాగార్జున హీరో అయి ఉండడని.. కొంచెం లెంగ్త్ ఎక్కువున్న స్పెషల్ రోల్ అయి ఉంటుందని సందేహించారు. ఐతే ఇలాంటి సందేహాలకు నాగార్జున తెరదించేశాడు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాజుగారి గది-2' సినిమాలో తనది గెస్ట్ రోల్ కాదని.. తనే ఇందులో హీరో అని నాగ్ స్పష్టం చేశాడు.

''రాజుగారి గది-2లో నేను గెస్ట్ రోల్ చేయట్లేదు. ఇందులో నేనే హీరో. ఇదొక డిఫరెంట్ మూవీ. కొత్త కొత్త జానర్లలో సినిమాలు చేయడం నాకిష్టం. అందుకే ఈ సినిమాలో నటిస్తున్నా. ఈ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. మైండ్ గేమ్ ఆడుతూ డిఫరెంట్‌గా సాగే పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను సరికొత్త లుక్‌లో కనిపిస్తాను. అదేంటన్నది రెండు మూడు వారాల తర్వాత తెలుస్తుంది. దర్శకుడు ఓంకార్ నా లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు. 'ఊపిరి' తర్వాత మరోసారి పీవీపీ గారితో సినిమా చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది'' అని నాగ్ చెప్పాడు. ఆదివారమే హైదరాబాద్‌లో రాజుగారి గది-2 ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ్ కొంచెం డిఫరెంట్‌గా తయారై వచ్చాడు. ఈ లుక్‌నే మరింత ఇంప్రొవైజ్ చేస్తారని.. 'రాజుగారి గది-2' నాగ్ డిఫరెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నాగ్‌ది మాంత్రికుడి పాత్ర కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు