పేరు అల్లుదే... పెత్తనం చరణ్‌ది!

పేరు అల్లుదే... పెత్తనం చరణ్‌ది!

ధృవ చిత్రానికి అధికారిక నిర్మాత అల్లు అరవింద్‌ అయినప్పటికీ ఇది కేవలం గీతా ఆర్ట్స్‌ బ్రాండింగ్‌ మాత్రమేనని, తెర వెనుక ఈ ప్రాజెక్ట్‌కి కర్త, కర్మ, క్రియ అన్నీ రామ్‌ చరణ్‌ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారని, సెట్స్‌లో అన్ని నిర్ణయాలు చరణ్‌ తీసుకున్నాడని అంటున్నారు. ఈ చిత్రానికి జరుగుతోన్న పబ్లిసిటీ నుంచి, షూటింగ్‌ చేసే లొకేషన్‌ వరకు ఏదైనా చరణ్‌ ఓకే చేస్తేనే ఫిక్స్‌ అవుతోందట. మామూలుగా గీతా ఆర్ట్స్‌ తరఫున వుండే పబ్లిసిటీ బృందం కూడా దీనికి లేకపోవడం ఈ పుకార్లకి ఊతమిస్తోంది.

ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా లాభంలో వాటా తీసుకుంటోన్న చరణ్‌ ఒక విధంగా దీనికి నిర్మాత అనే అనుకోవాలి. ఖైదీ నంబర్‌ 150 తర్వాత మాత్రం చరణ్‌ ఇక పూర్తి స్థాయి నిర్మాత అవతారం ఎత్తుతాడట. తాను షూటింగ్స్‌తో బిజీగా వున్నా తన నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక నమ్మకమైన టీమ్‌ తయారు చేసాడట. ఇంతా నిజమే అనుకుంటే, అసలు ఎందుకని గీతా ఆర్ట్స్‌ పేరు మీద ఈ చిత్రాన్ని మార్కెట్‌ చేస్తున్నారనేది మాత్రం అంతు చిక్కడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు