ఎన్టీఆర్‌కి యాభై కోట్ల డీల్‌

ఎన్టీఆర్‌కి యాభై కోట్ల డీల్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఇప్పుడు అందరు తెలుగు హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుతుందా? ఈ న్యూస్‌ నిజమైతే కనుక ఎన్టీఆర్‌ హయ్యస్ట్‌ పెయిడ్‌ టాలీవుడ్‌ యాక్టర్‌ అనేది నిజమే అనుకోవాలి. ఎందుకంటే పివిపి సినిమా గ్రూప్‌ ఎన్టీఆర్‌తో మూడు సినిమాలకి ఒప్పందం చేసుకోనుందని, దీని కోసం అతనికి యాభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంటే ఒక్క సినిమాకి సుమారు పదిహేడు కోట్ల రూపాయల పారితోషికం ఎన్టీఆర్‌కి ఇవ్వడానికి రెడీ అయినట్టే. అంటే ఇంతవరకు ఏ తెలుగు హీరో అందుకోని పారితోషికం అన్నమాట. బాలీవుడ్‌లో ఇలా మల్టిపుల్‌ సినిమాల డీల్స్‌ జరుగుతుంటాయి. తెలుగులో ఇదే మొదటిది అనుకోవచ్చు. ఎన్టీఆర్‌ సినిమాలకి అన్ని హక్కులతో కలుపుకుని ఒక్కో దానికీ నలభై అయిదు నుంచి యాభై కోట్ల వరకు బిజినెస్‌ జరుగుతుంది. సినిమా హిట్టయితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది.

ఎన్టీఆర్‌కి అంత బిజినెస్‌ స్టామినా ఉంది కాబట్టి అతనితో మూడు సినిమాల డీల్‌ కుదుర్చుకుంటే గుత్తంగా అదే బయ్యర్లకి అన్ని సినిమాలు ప్యాకేజ్‌గా అందజేయవచ్చు. దీని వల్ల ఫెయిల్‌ అవుతుందనే భయం ఉండదు. ఒక్కటి పోయినా రెండో దానితో లాభ పడవచ్చు కాబట్టి బయ్యర్స్‌ కూడా ధీమాగా కొనేస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English