స్టార్‌ అంటే కుదరదు నయన్‌!

స్టార్‌ అంటే కుదరదు నయన్‌!

ఈ మధ్యనే ఒక కొత్త సినిమా ప్రొడ్యూసర్‌ తన సినిమాలో ఒక సీనియర్‌ హీరో ప్రక్కన నటించడానికి నయన్‌ను ఎప్రోచ్‌ అయ్యాడట. మన సెక్సీ సుందరి మాత్రం నేను స్టార్‌ హీరోయిన్‌ను కదా అతని ప్రక్కన చెయ్యనూ అంటూ హ్యాండిచ్చింది. పైగా నన్ను ఇలాంటి సినిమాలకు ఎప్రోచ్‌కావద్దూ అంటూ క్లాస్‌ కూడా పీకిందట. అంటే ప్రస్తుతం నయనతార తను ఒక స్టార్‌ హీరోయిన్‌ అని ఫీలవుతుందనమాట. 

మరి నయన స్టార్‌ హీరోయినైతే సమంత, కాజల్‌, తమన్నాలను ఏమనాలి? వాళ్లకు ఉన్న రేంజ్‌ ముందు, గ్లామర్‌ అప్పీల్‌ ముందు ప్రస్తుతం నయన నథింగ్‌. ముదిరిపోయిన సెక్స్‌ అప్పీల్‌తో నయన కేవలం ఏజ్‌ ఎక్కువైన హీరోల ప్రక్కనే సెట్టవుతుంది కాని, ఒక చరణ్‌, బన్నీ, నితిన్‌ లాంటి హీరోలు ఖచ్చితంగా ఈమె వెంటపడరు. ఈ తరుణంలో నయన వచ్చి నేను స్టార్‌ హీరోయిన్‌ను అంటే కుదురుతుందా? విమర్శకులు మాత్రం నయన కాస్త ఓవర్‌ చేసి వచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు