బాహుబలి-2 లీకైందా.. ఐతే ఏంటి?

బాహుబలి-2 లీకైందా.. ఐతే ఏంటి?

'బాహుబలి: ది బిగినింగ్' సినిమాకు సంబంధించి అప్పట్లో పది నిమిషాలకు పైగా వీడియో ఫుటేజ్ లీకైంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి: ది కంక్లూజన్' విషయంలో ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఫలితం లేకపోయింది. ఈ సినిమాకు సంబంధించి కూడా కొంత వీడియో ఫుటేజ్ బయటికి వచ్చేసింది. గ్రాఫిక్ టీంలో పని చేసే ఓ వ్యక్తి దీన్ని లీక్ చేసేశాడు.

'బాహుబలి' నిర్మాతలు.. పోలీసులు సత్వరం స్పందించి.. చర్యలు చేపట్టడంతో పెద్దగా డ్యామేజ్ జరగలేదు. ఐతే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఈ వీడియో బయటికి వెళ్లిపోయింది. ఆన్ లైన్లో ఈ వీడియోను దాదాపుగా అన్ని చోట్లా తీయించేశారు. అయినప్పటికీ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో తిరుగుతోంది.

కాకపోతే అదృష్టం కొద్దీ లీకైన వీడియో అస్సలు క్లారిటీ లేదు. పైగా నిడివి తక్కువ. ఎడిట్ కాకముందు.. ఎఫెక్ట్స్ జోడించకముందు ఉన్న వెర్షన్ అది. అందులో ప్రభాస్.. అనుష్కల మీద తీసిన యుద్ధ సన్నివేశం ఒకటి ఉంటుందట కానీ.. వాళ్ల ముఖాలు కూడా సరిగా కనిపించవట. గ్రాఫిక్స్ జోడించడం కోసం ఇండికేషన్స్ ఇస్తూ తయారు చేసిన రా మెటీరియల్ లాంటిదట ఈ వీడియో. కాబట్టి లీక్ విషయంలో రాజమౌళి అండ్ కో ఏమీ టెన్షన్ పడట్లేదు. ఐతే అన్ని ఎఫెక్టులూ జోడించిన సన్నివేశాల విషయంలో మాత్రం అత్యంత పకడ్బందీగా ఉంటున్నారట. సెక్యూరిటీ ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయని.. మున్ముందు కూడా అవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు