విశాల్.. టూమచ్ చేస్తున్నాడే

విశాల్.. టూమచ్ చేస్తున్నాడే

తెలుగువాడైన తమిళ హీరో విశాల్‌కు ఒకప్పుడు తెలుగులోనూ మంచి మార్కెట్టే ఉండేది. కానీ దాన్ని చేజేతులా చెడగొట్టుకున్నాడు. వరుసగా అతడి చెత్త సినిమాలన్నీ కూడా తెలుగులోకి దించేయడంతో జనాలకు అతడి మీద ఉన్న నమ్మకం పోయింది. తమిళంలో మళ్లీ హిట్లు కొట్టి పుంజుకున్నాడు కానీ.. ఆ తర్వాత వచ్చిన అతడి సినిమాలేవీ ఆడలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. కొన్ని మంచి సినిమాల్ని సరైన టైమింగ్‌లో రిలీజ్ చేయకపోవడం మైనస్ అయింది. ఐతే విశాల్ కొత్త సినిమా 'ఒక్కడొచ్చాడు' మీద తెలుగులోనూ ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. ఈ సినిమాలో తమన్నా.. జగపతి బాబు నటించడం కూడా అందుకు కారణం కావచ్చు.

'ఒక్కడొచ్చాడు' దీపావళికే విడుదల కావాల్సింది. పోటీ ఎక్కువైందని వాయిదా వేశారు. ఇంతలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఈ నెల 18 నుంచి వాయిదా పడింది. ఐతే డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేసుకునే అవకాశమున్నా విశాల్ అందుకు సిద్ధంగా లేడు. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసుకుంటానని ప్రకటించాడు. ఐతే సంక్రాంతికి అటు తమిళంలో.. ఇటు తెలుగులో భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. తమిళంలో విజయ్ సినిమా 'భైరవ' సంక్రాంతికే వస్తుంది. తెలుగులో ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాల్ సినిమా చూస్తే రొటీన్ మాస్ మసాలా సినిమాలాగా ఉంది. వేరే భారీ సినిమాలతో పోటీ పడి నిలుస్తుందా అన్నది డౌట్‌గానే ఉంది. అయినా విశాల్ సంక్రాంతికే రిలీజ్ అని ఫిక్సయిపోయాడు. తమిళం సంగతేమో కానీ.. తెలుగు వెర్షన్ మాత్రం సంక్రాంతికి వస్తే అంతే సంగతులు. అలాగని ముందు తమిళంలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగులో అంటే అప్పటికి టాక్ బయటికి వచ్చేస్తుంది కాబట్టి మన ప్రేక్షకులు అసలే పట్టించుకోరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English