ప్రకాష్ రాజ్ చేతిలో తమన్నా

ప్రకాష్ రాజ్ చేతిలో తమన్నా

మూడేళ్ల కిందట బాలీవుడ్లో సూపర్ హిట్టయిన సినిమా 'క్వీన్'ను సౌత్ ఇండియన్ భాషల్లో రీమేక్ చేయడం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేయడం కోసం హక్కులు తీసుకున్నాడు. ఎప్పట్నుంచో దీని గురించి చెబుతున్నాడు. కానీ సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. నాలుగు భాషల్లోనూ వేర్వేరుగా తీయాలనుకుంటున్న త్యాగరాజన్.. అందుకు తగ్గ నటీనటుల్ని.. దర్శకుల్ని ఎంచుకునే విషయంలో ఆలస్యం చేశాడు. ఐతే ఎట్టకేలకు ఈ రీమేక్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏ భాషలో ఎవరితో ఈ సినిమా చేయబోయేది త్యాగరాజన్ వెల్లడించాడు.

''క్వీన్‌ సినిమా రీమేక్ హక్కులు రెండేళ్ల కిందటే తీసుకున్నా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ఫిబ్రవరిలో నాలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ మొదలవుతుంది. తెలుగు రీమేక్‌కు అనిష్‌ కురువిల్లా దర్శకత్వం వహిస్తారు. కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. తమిళంలో తమన్నా, మలయాళంలో అమలాపాల్‌ కథానాయికగా నటిస్తారు. ఈ రెండు వెర్షన్లకూ రేవతి దర్శకత్వం వహిస్తుంది. కన్నడలో ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. పారుల్‌ యాదవ్‌ ముఖ్య పాత్రధారి. ఈ నాలుగు భాషల్లోనూ అమీ జాక్సన్‌ రెండో కథానాయికగా (హిందీలో లిసా హేడెన్ చేసిన పాత్ర) కనిపిస్తుంది'' అని త్యాగరాజన్ వెల్లడించాడు. తెలుగు వెర్షన్ తీయబోయే అనీష్ కురువిల్లా ఇంతకుముందు ఆవకాయి బిర్యానీ, కో అంటే కోటి సినిమాలు తీశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English