శ్రుతి హాస‌న్ రెచ్చిపోయిన‌ట్లే ఉందే..

శ్రుతి హాస‌న్ రెచ్చిపోయిన‌ట్లే ఉందే..

'సింగం' సిరీస్ సినిమాల‌న‌గానే సూర్య త‌ర్వాత అనుష్కే గుర్తుకొస్తుంది. తొలి రెండు భాగాల‌కు ఆమె అంద‌చందాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ముఖ్యంగా ఫ‌స్ట్ పార్ట్‌లో రెచ్చిపోయి అందాల విందు చేసింది అనుష్క‌. రెండో భాగంలో డోస్ కొంచెం త‌గ్గించింది. మూడో భాగానికి వ‌చ్చేస‌రికి అనుష్క పూర్తిగా సైడైపోయేలా ఉంది. ఎందుకంటే ఇందులో శ్రుతి హాస‌న్ ఉంది మ‌రి. మాస్ సినిమాలంటే శ్రుతి ఎలా రెచ్చిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే 'సింగం-3 పోస్ట‌ర్ల‌లో హాట్ హాట్‌గా క‌నిపించి కుర్రాళ్ల దృష్టిని ఆక‌ర్షించింది శ్రుతి.

తాజాగా రిలీజ్ చేసిన పాట‌ల ప్రోమోలు చూస్తే శ్రుతి షో మామూలుగా ఉండ‌బోద‌ని అర్థ‌మ‌వుతోంది. వైవై వైఫై అంటూ ఒక పాటతో పాటు 'ఎస్‌-3' సినిమాలోని మ‌రికొన్ని పాట‌ల ప్రోమోలు రిలీజ్ చేశారు. ఈ వైఫై పాట‌లో శ్రుతి హాసన్ అందాలే హైలైట్. మోడ‌ర్న్ డ్రెస్సుల్లో రెచ్చిపోయింది శ్రుతి. త‌న ఒంపుసొంపుల్ని బాగా చూపించేస్తే హాట్ హాట్ డ్యాన్సులు చేసింది శ్రుతి. ఇంత‌కుముందు సూర్య‌తో ఆమె చేసిన 'సెవ‌న్త్ సెన్స్ మూవీలో ఎంత ప‌ద్ధ‌తిగా క‌నిపించిందో గుర్తుండే ఉంటుంది. ఐతే అప్ప‌టికి.. ఇప్ప‌టికి ఆమె ఇమేజ్ బాగా మారింది. ఇప్పుడున్న హాట్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా సినిమాలో అందాల విందు చేసేలా ఉంది శ్రుతి. సినిమాలో ఆమె ముందు అనుష్క వెనుక‌బ‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Click Here For The Video

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు