అల్లరోడి హీరోయిన్ లిప్ లాక్ కష్టాలు

అల్లరోడి హీరోయిన్ లిప్ లాక్ కష్టాలు

ఈ రోజుల్లో లిప్ లాక్ అన్నది చాలా చిన్న విషయం. ఐతే తనకు మాత్రం అది చాలా పెద్ద విషయం అంటోంది హోమ్లీ హీరోయిన్ పూర్ణ. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన తనకు కొన్ని పరిమితులున్నాయని.. కాబట్టే 'సీమ టపాకాయ్' సినిమాలో అల్లరి నరేష్‌ తో లిప్ లాక్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని పూర్ణ చెప్పింది. పూర్ణ అసలు పేరు షమ్మ ఖాసిమ్. ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. తన బ్యాగ్రౌండ్ ప్రకారం హీరోయిన్ కావడమే గొప్ప అని.. ఐతే గ్లామర్ వేషాలు వేయడానికి ఎంతైనా ఇబ్బంది పడతానని పూర్ణ చెప్పింది.

''నేను సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను. డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా.. నువ్వు అసలు ముస్లింవేనా అంటారు. ఇలాంటి మాటలు చాలా విన్నాను. అయినా మా కుటుంబం నాకు అండగా నిలిచింది. ముఖ్యంగా మా అమ్మ ఎంత సపోర్ట్ చేసిందో చెప్పలేను. సీమ టపాకాయ్ సినిమాలో లిప్ లాక్ చేయడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నాను. మా అన్నయ్య సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తారు. నా సినిమాలు చూస్తుంటారు. స్నేహితులకూ చూపిస్తుంటారు. ఆయన ఆ సీన్ వల్ల కొంచెం అప్సెట్ అయ్యారు. ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటారో నేను ఊహించగలను. కాబట్టి నేను ఎప్పుడూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అని పూర్ణ చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు