చిరంజీవికి చుక్కలు చూపిస్తోన్న బాలయ్య!

చిరంజీవికి చుక్కలు చూపిస్తోన్న బాలయ్య!

ఖైదీ నంబర్‌ 150 సంక్రాంతికి రాదేమోననే అనుమానాలు తొలగిపోయినట్టే. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి సకల సన్నాహాలు జరిగిపోతున్నాయి. అయితే ఈ చిత్రానికి కొత్త చిక్కు వచ్చి పడిందట. జనవరి 11న ఖైదీని విడుదల చేద్దామని చూస్తున్నారు. కానీ ఇప్పుడు అదే రోజున బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలకి రెడీ అయింది. డైరెక్ట్‌ క్లాష్‌ కావడంతో థియేటర్ల సమస్య వస్తుంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' బయ్యర్లు ముందునుంచే అలర్ట్‌గా వుండడంతో, వారం రోజులకి థియేటర్లు బ్లాక్‌ చేసి పెట్టుకున్నారు. పండగ సీజన్‌ ముగిసే వరకు శాతకర్ణి థియేటర్లు ఇక వేరే సినిమాలకి దొరకవు.

దిల్‌ రాజు అండర్‌లో వున్న థియేటర్లలో 'శతమానం భవతి' విడుదల కానుంది. మిగిలిన ఆ కొద్ది థియేటర్లలోనే ఖైదీ చిత్రాన్ని విడుదల చేయాల్సి వస్తుంది. లేదంటే పండగ ముందు వారం, జనవరి 6నే 'ఖైదీ'ని విడుదల చేయాలి. సహజంగా సంక్రాంతి ముందు వసూళ్లు అంతగా వుండవు. కాబట్టి అంత రిస్క్‌ తీసుకోవడానికి ఖైదీ నిర్మాతలు సాహసించడం లేదు. మొత్తానికి రీఎంట్రీతో సత్తా చాటుకుందామని చూస్తోన్న చిరంజీవిని బాలయ్య మామూలుగా ఇబ్బంది పెట్టడం లేదు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి అల్లు అరవింద్‌ ఏం చక్రం తిప్పుతారనేది చూడాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు