బాక్సాఫీస్‌ తుక్కు రేగ్గొడుతోంది

బాక్సాఫీస్‌ తుక్కు రేగ్గొడుతోంది

పెద్ద నోట్ల రద్దు టైమ్‌లో విడుదల చేస్తున్నారేంటి, వీళ్లకేమైనా పిచ్చా అంటూ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' నిర్మాతల సాహసం గురించి కామెంట్లు పడ్డాయి. కానీ పరిస్థితులతో పట్టింపు లేకుండా ఈ చిత్రం తొలి ఆట నుంచే అదరగొట్టింది. వారాంతం తర్వాత నెమ్మదిస్తుందని అనుకున్న ఈ చిత్రం వర్కింగ్‌ డేస్‌లో కూడా సూపర్‌ షేర్స్‌ తెచ్చుకుంటోంది. ఇప్పటికే చాలా మంది బయ్యర్లకి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. ఈ శుక్రవారంతో అందరూ లాభాల బాట పట్టేస్తారని ట్రేడ్‌ చెబుతోంది. హిట్‌ స్టేటస్‌ దక్కించుకోవడం కష్టమేమో అనుకున్న సినిమా ఇప్పుడు సూపర్‌హిట్‌ కావడం ఖాయమైంది.

ఈ శుక్రవారం విడుదలవుతోన్న సినిమాలు ప్రభావం చూపించకపోతే, బ్లాక్‌బస్టర్‌ అవడానికి స్కోప్‌ పెరుగుతుంది. నిఖిల్‌ కెరియర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిన్న నిర్మాతలకే కాకుండా పెద్ద నిర్మాతలకి కూడా దారి చూపించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సినిమా విడుదల చేయడానికి జంకిన వాళ్లంతా ఈ సక్సెస్‌ చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు. కథని నమ్ముకుంటే విజయం ఖాయమని నిఖిల్‌కి ఈ చిత్రంతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఇకపై శంకరాభరణం లాంటి కమర్షియల్‌ కథల జోలికి పోనని తెగేసి చెబుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు