నారా రోహిత్ సినిమాలో మంచు లక్ష్మి

నారా రోహిత్ సినిమాలో మంచు లక్ష్మి

నారా రోహిత్-మంచు లక్ష్మీప్రసన్న.. కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది కదా. వీళ్లిద్దరినీ ఒకే సినిమాలో చూడబోతున్నాం. ఐతే రోహిత్‌కు లక్ష్మి కథానాయిక కాదులెండి. ఆమెది చిన్న క్యామియో రోల్ మాత్రమే. ఆమె మాత్రమే కాదు.. ఇంకా కొంతమంది తారలు రోహిత్ కొత్త సినిమా 'కథలో రాజకుమారి'లో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే..

మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న 'కథలో రాజకుమారి' సినిమాలో నారా రోహిత్ సినీ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట. ఇందులో భాగంగా కొందరు సినీ ప్రముఖులు వారి నిజ జీవిత పాత్రల్లోనే కనిపించబోతున్నారు. మంచు లక్ష్మి.. నిర్మాత పాత్రలో దర్శనమిస్తుందట. ఇంకా ఇందులో నాగశౌర్య మరో హీరోగా.. ఆదాశర్మ ఒక హీరోయిన్‌గా.. అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కనిపిస్తారట. ఇంకా మరికొందరు టాలీవుడ్ సెలబ్రెటీలు సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్నారు.

గత ఏడాదే మొదలైన ఈ సినిమా కొంచెం ఆలస్యమవుతోంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన మలయాళ అమ్మాయి నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పటికే 'చుట్టాలబ్బాయి' సినిమా చేసింది. వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు