కుర్రోడిని చిక్కుల్లో పడేసిన సమంత

కుర్రోడిని చిక్కుల్లో పడేసిన సమంత

సౌత్ ఇండియాలో చాలామంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని.. ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డును ఈ మధ్యే అందుకుంది సమంత. ట్విట్టర్లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్ మార్కును దాటింది. సమంత ట్విట్టర్లోకి వచ్చిన నాలుగేళ్లకే ఈ ఘనత సాధించడం మరో విశేషం. మరి సమంత ట్విట్టర్లో అంత ఫేమస్ ఎందుకైంది అంటే.. ఆమె చేసే వ్యాఖ్యలు.. రకరకాల అంశాలపై ఆమె స్పందించే తీరు వల్లే. గతంలో మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. ట్విట్టర్లో ఇలాంటి చిలిపి వేషాలు చాలానే వేస్తుంటుంది సామ్. ఇలాంటి వాటి వల్లే ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఫాలోవర్లూ పెరిగారు.

తాజాగా మరోసారి సమంత తన చిలిపితనాన్ని ప్రదర్శించింది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను ఆమె ఇరకాటంలో పడేసింది. ఈ కుర్రాడు తాజాగా ఓ అమ్మాయితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై అతను స్పందిస్తూ.. "నాకు ఎంగేజ్మెంటా.. హహహ.. నేను సింగిల్.. ఇంకా యంగ్" అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐతే ఇంతలో సమంత ఎంటరైంది. అనిరుధ్‌ కామెంట్ మీద రెస్పాండవుతూ.. "కానీ ఆ అమ్మాయి చాలా స్వీట్ కదా.. ఏమైంది?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. దీంతో జనాల్లో మళ్లీ అనిరుధ్ మీద సందేహాలు మొదలయ్యాయి. అతడికి ఏదో వ్యవహారం అయితే ఉందని మాత్రం జనాలకు క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి సూటిగా ఏదీ చెప్పకుండానే చేయాల్సిందల్లా చేసేసింది సామ్. సమంత దెబ్బకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంటైపోయాడు అనిరుధ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు