ఆ హీరోతో రొమాన్స్.. ఈ హీరోకు కూతురా?

ఆ హీరోతో రొమాన్స్.. ఈ హీరోకు కూతురా?

తెలుగులో 'అఖిల్' లాంటి క్రేజీ మూవీతో కథానాయికగా పరిచయమైంది ముంబయి భామ సాయేషా సైగల్. కానీ ఎంతో హైప్ తెచ్చుకున్న ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని చూడటంతో సాయేషా తెలుగులో వన్ ఫిల్మ్ వండర్ అయిపోయింది. తెలుగు సంగతి వదిలేసి సొంతగడ్డకు వెళ్లిపోయి.. అక్కడ 'శివాయ్' లాంటి మరో భారీ ప్రాజెక్టుతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంది సాయేషా. కానీ అక్కడా అలాంటి ఫలితమే ఎదురైంది. సినిమా ఆడలేదు. అజయ్ దేవగణ్ తో ఆమె రొమాన్సూ పండలేదు. ఐతే హిందీలో మరో అవకాశమైతే దక్కించుకుంది సాయేషా.

మరో సీనియర్ హీరో సంజయ్ దత్ తో ఓ సినిమా చేస్తోంది సాయేషా. ఐతే అజయ్ దేవగణ్ సరసన కథానాయికగా నటించిన సాయేషా.. దాదాపు అతడి వయసే ఉన్న సంజయ్ దత్ కు మాత్రం కూతురిగా నటిస్తుండటం విశేషం. 'మేరీ కోమ్'.. 'సరబ్జీత్' లాంటి సినిమాలు తీసిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. 'భూమి' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒమంగ్ కుమార్ సామాజిక అంశాలున్న సందేశాత్మక సినిమాలు తీస్తుంటాడు. సాయేషాది ఇందులో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అట. ఆమెదే దాదాపుగా లీడ్ రోల్ అని సమాచారం. నాలుగేళ్ల జైలు జీవితం పూర్తి చేసుకుని తిరిగొచ్చాక సంజయ్ దత్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English