అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు?

అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు?

'చిన్నారి పెళ్లి కూతురు' సీరియ‌ల్‌తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అవికా గోర్‌కు టాలీవుడ్ల ఘ‌న‌మైన స్వాగ‌త‌మే ప‌లికింది. ఆమె తొలి సినిమా 'ఉయ్యాల జంపాల' మంచి విజ‌యం సాధించింది. అవికా న‌ట‌న‌కూ మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన 'సినిమా చూపిస్త మావ కూడా సూప‌ర్ హిట్టే. అయిన‌ప్ప‌టికీ తెలుగులో అనుకున్న స్థాయిలో బిజీ కాలేక‌పోయింది అవికా. లేటెస్టుగా 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'తో మ‌రో హిట్టు కొట్టిన‌ప్ప‌టికీ అవికా తెలుగు సినిమాల్లో కొన‌సాగాల‌ని అనుకోవ‌ట్లేద‌ట‌. ఇక‌పై హిందీ సినిమాలు.. సీరియ‌ళ్ల‌కే ప‌రిమితం అయిపోవాల‌ని ఆమె ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. ఇందుకు ఓ తెలుగు యువ క‌థానాయ‌కుడు చేసిన నిర్వాక‌ర‌మే కార‌ణ‌మ‌ట‌.

తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాక ఇక్క‌డి యువ క‌థానాయ‌కులు.. క‌థానాయిక‌ల‌తో అవికాకు మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌టం.. అంద‌రూ క‌లిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని.. చాట్‌లు చేయ‌డం.. త‌ర‌చుగా లంచ్‌లు, డిన్న‌ర్లు చేయ‌డం ఆన‌వాయితీగా మారింద‌ట‌. ఐతే వీళ్ల వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న ఒక హీరో అవికాకు ప‌ర్స‌న‌ల్‌గా కొన్ని అభ్యంత‌క‌ర‌మైన సందేశాలు పంపించాడ‌ట‌. దీనిపై ఆమె వార్నింగ్ ఇచ్చినా.. కొన్నాళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూసినా ఫ‌లితం లేక‌పోయింద‌ట‌. దీంతో ఆమె అత‌డి మెసేజ్‌ల‌న్నింటినీ స్క్రీన్ షాట్స్ తీసి గ్రూప్‌లో పోస్ట్ చేసి హీరోగారి నిర్వాకం గురించి అంద‌రికీ తెలియ‌జేసింద‌ట‌. ఈ గ్రూప్‌లో ఉన్న సాయిధ‌ర‌మ్ తేజ్.. ర‌కుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు అవికాకు స‌పోర్ట్ చేయ‌గా.. గ్రూప్ అడ్మిన్ మాత్రం ఆమెనే త‌ప్పుబ‌డుతూ.. త‌న‌ను గ్రూప్ నుంచి తొల‌గించాడ‌ట‌. ఈ ప‌రిణామంతో చిన్న‌బుచ్చుకున్న అవికా.. అస‌లు తెలుగు సినిమాల్లో న‌టించ‌డమే వ‌ద్ద‌ని.. డిసైడ‌య్యింద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు