రాజమౌళికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి

రాజమౌళికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి

'బాహుబలి' మొదటి భాగానికి సంబంధించి వీడియో క్లిప్ బయటకి వచ్చినప్పుడు రాజమౌళి, అతని బృందం చాలా గాబరా పడ్డారు. అయితే రెండో భాగం తీస్తున్నప్పుడు అయినా జాగ్రత్త పడలేదు. సినిమాలోని అతి కీలకమైన సన్నివేశాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యేసరికి రాజమౌళికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. బయటకి లీక్ అయిన దానికంటే ఇంకా లీక్ చేయనిది వాళ్ల దగ్గర ఎంత ఫుటేజీ వుందోనని రాజమౌళి తెగ వర్రీ అయిపోయాడు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బిజినెస్ చేస్తోన్న ఈ చిత్రానికి పైరసీ రూపంలో ఆటంకం ఎదురు కాకూడదు. ఇలాంటి వీడియోల వల్ల సినిమాకి నష్టం జరగడంతో పాటు సినిమాపై జనంలో వున్న ఆసక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే అన్ని పనులూ మానేసి ఈ వీడియో లీక్ చేసిందెవరో కనిపెట్టే పనిలో మునిగి మొత్తానికి ఇంటి దొంగని పట్టేసారు.

అతని వద్ద వున్న ఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంఘటనతో అలర్ట్ అయిన రాజమౌళి సెక్యూరిటీ పెంచేసాడట. లీకేజీ జరిగేది ఎడిటింగ్ టేబుల్ మీదే కనుక అక్కడ తనకి నమ్మకస్తులైన వారిని నియమించాడట. అలాగే సిసిటీవీ కెమెరాలు కూడా గ్రాఫిక్స్ వర్క్ జరిగే చోట్ల అడుగడుగునా ఏర్పాటు చేస్తున్నారట. టెక్నాలజీని విపరీతంగా అడ్డదార్లకి వాడేస్తోన్న ఈ రోజుల్లో భారీ సినిమాల విషయంలో అలసత్వం ఏమాత్రం పని చేయదు. ఎవడో చేసే తింగరి పని వల్ల కోట్లకి కోట్లు బూడిదలో కలిసిపోయే ప్రమాదం వుంటుంది మరి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు