శాశ్వితంగా బాల ‘మురళీ’ మూగబోయింది

శాశ్వితంగా బాల ‘మురళీ’ మూగబోయింది

గాన గంధర్వుడు గళం శాశ్వితంగా మూగబోయింది. ఆ మధుర కంఠం ఇక వినే అదృష్టం సంగీతాభిమానులకు లేనట్లే. కర్ణాటక సంగీత విద్యాంసులుగా సుపరిచితులైన 86 ఏళ్ల మంగళంపల్లి బాలమురళీకృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అచ్చ తెలుగు బిడ్డే అయినప్పటికీ తమిళనాడులో ఉండిపోయిన ఆయన.. 1930 జులై ఆరున తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య కాగా.. తల్లి సూర్యకాంతం. ఆరేళ్ల వయసులో గాయకుడిగా తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. గాత్రంలోనేకాదు.. వయోలిన్.. వీణ.. మురళి.. మృదంగం తదితర సంగీత వాయిద్యాలతో బహుముఖంగా ప్రావీణ్యం పొందారు.

ప్రపంచవ్యాప్తంగా తన సంగీతంతో కళాభిమనుల్ని అలరించిన ఆయన.. తిరుమల తిరుపతి దేవస్థానం.. శృంగేరీ పీఠాల అస్థాన విద్యాంసునిగా పని చేశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.  ఆయన మరణవార్త సాయంత్రానికి కానీ బయటకు రాలేదు. బాల మురళీకృష్ణ ఇక లేరన్న వార్త విన్న వెంటనే సంగీతాభిమానుల మనసులు మూగబోయాయి. తన అమృత కంఠంతో రస హృదయాల్ని ఓలలాడించిన ఆయన ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా 25వేల సంగీత కచేరీలను నిర్వహించారు.పద్మభూషణ్ పురస్కారం.. డాక్టరేట్లను పొందిన ఆయన.. ప్రపంచస్థాయిలోబెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు