ఆ సినిమా రిలీజైతే కళ్యాణ్‌రామ్ తేల్చుకుంటాడు

ఆ సినిమా రిలీజైతే కళ్యాణ్‌రామ్ తేల్చుకుంటాడు

‘పటాస్’ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా అతడు చేస్తున్న ప్రయత్నం ఫలించడంతో ఇక అతడి తిరుగు లేదనుకున్నారు. ఈ ఊపులో దూసుకెళ్లిపోతాడనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ‘షేర్’ రూపంలో గట్టి దెబ్బ తగిలేసింది. ఆ పరాజయాన్ని మరిచిపోయి పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో పని చేసే ఛాన్స్ వచ్చింది కదా అని ఎగ్జైట్ అయ్యాడు. సొంత బేనర్లో భారీ ఖర్చుతో ‘ఇజం’ చేశాడు. ఫలితమేంటో తెలిసిందే. ఈ సినిమా రిలీజవ్వడానికి ముందు కళ్యాణ్ రామ్‌తో ముగ్గురు నలుగురు డైరెక్టర్లతో ముడిపెట్టారు.

‘ఇజం’ విడుదలై నెల రోజులవుతున్నా ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ ప్రాజెక్టేదీ ఓకే కాలేదు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరితో సాయిధరమ్ కాంబినేషన్లో అనుకున్న మల్టీస్టారర్ సంగతి తేలలేదు. అనిల్ రావిపూడితో అనుకున్న ప్రాజెక్టు కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇంకా ఒకరిద్దరు దర్శకులతో కాంబినేషన్లు వర్కవుట్ కాలేదు. ఐతే ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ సినిమాకు ఫ్రంట్ రన్లో ఉన్నది జి.నాగేశ్వరరెడ్డి. కామెడీ చిత్రాల స్పెషలిస్టు అయిన నాగేశ్వరరెడ్డి ఫ్లాపుల్లో ఉన్న చాలామంది హీరోలకు హిట్లిచ్చాడు. పైగా తక్కువ బడ్జెట్లో మినిమం గ్యారెంటీ సినిమాలిస్తాడన్న పేరుంది. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ చూపు అతడిపై పడిందని సమాచారం. నాగేశ్వరరెడ్డి కూడా ఆసక్తితోనే ఉన్నాడట. కాకపోతే ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ రిజల్ట్ చూశాక డిసైడవుదామని అనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఈ నెల 11నే రావాల్సిన ఈ చిత్రం పెద్ద నోట్ల రద్దు వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు