ముగ్గురు హీరోయిన్లకూ మూడినట్లే..

ముగ్గురు హీరోయిన్లకూ మూడినట్లే..

ఆరేడేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలారు కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియా.. సమంత రూత్ ప్రభు. 2010 తర్వాత వీళ్ల హవా మామూలుగా లేదు. తెలుగు స్టార్ హీరో సినిమా అంటే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కథానాయికగా ఉండాల్సిందే. ఈ ముగ్గురూ దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. స్టార్లతో ఒకటికి మించి సినిమాల్లో నటించారు.

ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి ఈ ముగ్గురి హవా తగ్గిపోయింది. ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా సైడైపోతున్నారు. స్టార్లు చేస్తున్న.. చేయబోయే కొత్త సినిమాల్లో ఈ ముగ్గురిలో ఎవరికీ చోటు దక్కట్లేదు. ఈ ముగ్గురికీ క్రేజ్ పూర్తిగా పడిపోయిందని లేదు కానీ.. వేర్వేరు కారణాల వల్ల వీరికి ఛాన్సులు దక్కట్లేదు. సమంత పెళ్లి మూడ్లోకి వచ్చేశాక ఆమెను ఎవరూ కన్సిడర్ చేస్తున్నట్లు లేరు. తమన్నా తమిళ సినిమాల పైకి దృష్టి మళ్లించింది. కాజల్.. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయింది.

మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పీక్స్ అందుకోగా.. కీర్తి సురేష్.. పూజా హెగ్డే లాంటి క్యూట్ హీరోయిన్లు రేసులోకి వచ్చారు. రకుల్ ప్రీత్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలే వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కీర్తి.. పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబుతో కూడా అవకాశం దక్కేలా ఉందంటున్నారు. మరోవైపు పూజా హెగ్డే.. బన్నీతో సినిమా చేస్తోంది. పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాకూ కన్సిడర్ చేస్తున్నారట. మరోవైపు మేఘా ఆకాశ్ అనే కొత్తమ్మాయి దూసుకొస్తోంది. మొత్తానికి పాత నీరు పోవడం.. కొత్త నీరు రావడం ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి టాలీవుడ్లో కాజల్-తమన్నా-సమంతల శకం దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది.