రెడ్డిగారికి తన సినిమాపై ఎంత కాన్ఫిడెన్సో..

రెడ్డిగారికి తన సినిమాపై ఎంత కాన్ఫిడెన్సో..

సినిమా రిలీజవ్వడానికి ముందు రోజు రాత్రి సెలబ్రెటీలకు ప్రివ్యూలు వేయడం ఇండస్ట్రీలో మామూలే. ఐతే రిలీజ్‌కు రెండు రోజుల ముందు సామాన్య జనానికి కూడా ప్రివ్యూ వెయ్యాలంటే గట్స్ ఉండాలి. సినిమా బాలేకపోయి.. నెగెటివ్ టాక్ బయటికి వచ్చిందంటే మామూలు దెబ్బ తగలదు. సినిమా మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప రెండు రోజుల ముందు 5 లొకేషన్లలో ప్రివ్యూలు వేయరు. ఐతే కమెడియన్ శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' టీం మాత్రం ఈ సాహసమే చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఫారిన్ లొకేషన్లు కూడా కలుపుకుని బుధవారం నాడు ఐదు చోట్ల ప్రివ్యూలు ప్లాన్ చేసింది.

సెలబ్రెటీలతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా విడుదలకు రెండు రోజుల ముందే ఫ్రీగా సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది 'జయమ్ము నిశ్చయమ్మురా' టీం. హైదరాబాద్.. విజయవాడతో పాటు అమెరికా.. యూకేల్లో ప్రివ్యూలు ప్లాన్ చేశారు. ఇలా రెండు రోజుల ముందే ప్రివ్యూలంటే సినిమా మీద టీం అంతా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్నుంచి ఈ సినిమా ప్రోమోలు అవీ చూస్తుంటే ఒక పాజిటివిటీ కనిపిస్తోంది. సినిమా కూడా బాగా వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే శ్రీనివాసరెడ్డి హీరో అయినా.. ఈ చిత్రానికి రూ.7 కోట్ల బిజినెస్ జరిగింది. శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి సరసన పూర్ణ కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు