దూకుడు నటుడు.. అలాంటి ఫొటోలు పంపించాడు

దూకుడు నటుడు.. అలాంటి ఫొటోలు పంపించాడు

'దూకుడు' సినిమాలో విలన్ సోనూ సూద్ తమ్ముడిగా బంటీ అనే పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? అతడి పేరు అజాజ్ ఖాన్. సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన ఈ నటుడు హిందీలోనూ కొన్ని సినిమాలు చేశాడు. ఈ నటుడు ఓ అమ్మాయికి అసభ్యకర ఫొటోలు పంపడమే కాక.. ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడన్న ఆరోపణలతో అరెస్టయ్యాడు.

ముంబయికి చెందిన ఒక హెయిర్ స్టైలిస్ట్‌తో కొన్నాళ్ల కిందట అజాజ్‌కు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. తర్వాత వాళ్లిద్దరూ వాట్సాప్ ద్వారా తరచుగా మాట్లాడేవాళ్లు. ఈ క్రమంలోనే తాను మొదలుపెట్టాలనుకుంటున్న ఒక బిజినెస్ గురించి ఆమె అజాజ్‌కు చెప్పగా.. అతను అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించాడు. ఆమెను ఫిల్మిస్థాన్ స్టూడియోకు రమ్మన్నాడు. ఐతే అక్కడ మాట్లాడేపటుడు అజాజ్ కొంచెం తేడాగా మాట్లాడాడట.

ఇదిలా ఉండగా.. ఇటీవలే వాట్సాప్‌లో అజాజ్ డిస్ప్లే పిక్ గురించి ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టిందట ఆ అమ్మాయి. దీంతో అజాజ్ రెచ్చిపోయి తన ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు పంపించి ఆమెకు ఇంకో రకమైన మెసేజ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కంగుతిని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అజాజ్ ఆమెను బూతులు తిట్టాడట. ఆమె అతడిపై కేసు పెట్టగా.. పోలీసులు అజాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రూ.10 వేలు జరిమానా కట్టి అజాజ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. తనమీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని అతనంటున్నాడు. ఐతే అజాజ్ ఇంతకుముందు కూడా ఓ మోడల్‌కు ఇలాంటి అసభ్య ఫొటోలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు