నాకా.. నిత్యామీనన్‌తో గొడవా?

నాకా.. నిత్యామీనన్‌తో గొడవా?

తమిళ సినిమాల్లో మంచి పేరు సంపాదించిన తెలుగమ్మాయి శ్రీదివ్య.. ఈ మధ్య ఒక చిన్న వివాదంలో చిక్కుకుంది. నిత్యామీనన్ గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే ఆ వివాదం గురించి శ్రీదివ్య క్లారిటీ ఇచ్చింది. "నిత్యామీనన్ అంటే నాకు ధ్వేషం అని అన్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. నేను మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. నిజానికి నేను అన్న మాటలు వేరు. నిత్యకు కథా బలం ఉన్న సినిమాల్లో అవకాశాలు వస్తుంటాయి. నిత్యా ఒక సినిమా చేస్తోందంటే.. అందులో కచ్చితంగా బలమైన కథ ఉండి తీరుతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇంతమంది నమ్మకాన్ని.. ఇంతమంచి అవకాశాల్ని సంపాదించుకుంటున్న నిత్యను చూస్తుంటే అసూయగా ఉంటుందని నేను అన్నాను. అంతే తప్ప వ్యక్తిగతంగా నాకెలాంటి ధ్వేషం లేదు. ఆమెతో నాకెలాంటి గొడవా లేదు" అని శ్రీదివ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

తన కెరీర్లో మరపురాని ఘటన గురించి ఈ ఇంటర్వ్యూలో శ్రీదివ్య వెల్లడించింది. "నాకు డ్యాన్స్ సరిగా రాదు. ఐతే ఓ తమిళ సినిమాలో నేను డ్యాన్స్ చేయాల్సి వచ్చినపుడు.. కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి నాకు డ్యాన్స్ సరిగా రాదని.. తేలిగ్గా ఉండే స్టెప్పులు డిజైన్ చేయమని చెప్పాను. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వారు. నాకు పంతం పెరిగింది. నా చెల్లెలికి డ్యాన్స్ బాగా వచ్చు. ఆమె ఫోన్లోనే టిప్స్ ఇచ్చింది. కొన్ని డ్యాన్స్ వీడియోలు కూడా చూస్తూ ఆ రాత్రంతా బాగా ప్రాక్టీస్ చేశాను. మరుసటి రోజు వచ్చి షూటింగ్ స్పాట్లో నేను డ్యాన్స్ చేసిన తీరుకు అందరూ స్టన్ అయిపోయారు. నన్ను చూసి ముందు రోజు నవ్వినవాళ్లే ఆశ్చర్యపోయారు. అభినందించారు" అని శ్రీదివ్య తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు