ప్రభాస్ విలన్.. ఒక ఆసక్తికర కబురు

ప్రభాస్ విలన్.. ఒక ఆసక్తికర కబురు

మూడేళ్లుగా 'బాహుబలి' సినిమాకే అంకితమైపోయి ఉన్నాడు ప్రభాస్. మరో వైపు యువ దర్శకుడు సుజీత్ తన రెండో సినిమా ప్రభాస్‌తోనే చేసి తీరాలని కూర్చున్నాడు. గత రెండేళ్లలో అతను రెండు సినిమాలైనా చేసి ఉండొచ్చు. మామూలుగా ఏ కుర్ర దర్శకుడైనా తన తొలి సినిమా హిట్టయ్యాక వరుసగా చేయడానికే ఇష్టపడతాడు. ఇంత గ్యాప్ తీసుకోడు. కానీ సుజీత్ మాత్రం ప్రభాస్ సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు. ఈ గ్యాప్‌లో స్క్రిప్టును మరింతగా మెరుగులు దిద్దుకుంటూ కూర్చున్నాడతను. మళ్లీ మళ్లీ ఇలా టచప్స్ ఇస్తూ పోవడంతో స్క్రిప్టు మరింత ఎగ్జైటింగ్‌గా తయారైందని సమాచారం. 'రన్ రాజా రన్'తో పోలిస్తే ఇందులో మలుపులు.. సర్ప్రైజ్‌లు చాలానే ఉంటాయట.
జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా మంచి స్టేచర్ ఉన్న వాడినే పట్టుకొస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ విలన్‌గా ఫైనలైజ్ అయ్యాడు. తమిళ బ్లాక్ బస్టర్ 'కత్తి'లో విలన్ క్యారక్టర్లో అదరగొట్టేశాడు నీల్. ఆ సినిమా చూసే సుజీత్ నీల్‌ను ఎంచుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఇందులో విలన్‌ది ద్విపాత్రాభినయమట. నీల్ నితిన్ కవలలుగా నటించబోతున్నాడట. వారిలో ఒకరు మంచోడైతే.. ఇంకొకడు విలన్. ఐతే ఎవరు ఎలాంటి వాడన్నది బయటికి తెలియదు. ప్రభాస్ ఆ విలన్ గుట్టు బయటపెట్టే నేపథ్యంలో కథ సాగుతుందట. 'రన్ రాజా రన్'తో ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేసిన సుజీత్.. ఈసారి మరింత ఎగ్జైటింగ్ సినిమా అందిస్తాడనే ఆశిస్తున్నారు జనాలు. డిసెంబరు నెలాఖర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు