కన్‌ఫామ్‌... సమంతకి హ్యాండ్‌ ఇచ్చేసాడు

కన్‌ఫామ్‌... సమంతకి హ్యాండ్‌ ఇచ్చేసాడు

వరుసగా మూడు సినిమాల్లో సమంతనే హీరోయిన్‌గా పెట్టుకున్న త్రివిక్రమ్‌ మరోసారి ఆమెకి ఛాన్స్‌ ఇస్తాడని ప్రచారం జరిగింది. పవన్‌తో త్రివిక్రమ్‌ తీసే సినిమాలో సమంత నటిస్తుందని మీడియా ఘంటాపథంగా చెప్పింది. కానీ త్రివిక్రమ్‌ వెళ్లి కీర్తి సురేష్‌ని కథానాయికగా తీసుకున్నాడు. ఇంకో హీరోయిన్‌ పాత్ర వుంది కాబట్టి అది తప్పకుండా సమంతనే వరిస్తుందని అనుకున్నారు. పెళ్లి వార్తల నేపథ్యంలో తాను కొత్త సినిమాలు చేయడానికి సిద్ధంగా లేదని పరిశ్రమ భావిస్తోందని అర్థమై నటించడానికి సిద్ధమంటూ సమంత ప్రకటించింది.

అయినప్పటికీ త్రివిక్రమ్‌ వినిపించుకోలేదు. పవన్‌తో తీసే సినిమాలో పాత హీరోయిన్లకి చోటు లేదంటూ మరో హీరోయిన్‌తో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఇందులో రెండో హీరోయిన్‌గా పూజా హెగ్దే నటిస్తుందట. ప్రస్తుతం బన్నీతో డిజె చేస్తోన్న పూజకి టాలీవుడ్‌లో డిమాండ్‌ బాగానే వుంది. కానీ మధ్యలో హిందీ సినిమా చేసి రావడంతో ఇక్కడ కనిపించలేదు. బన్నీ తర్వాత పవన్‌ సినిమా ఖరారైతే ఇక పూజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని వుండదు. త్రివిక్రమ్‌ కూడా హ్యాండ్‌ ఇచ్చేసినట్టే కాబట్టి సమంతకి మళ్లీ ఇక్కడ ఛాన్స్‌ ఇచ్చేది ఎవరో చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు