నయనతార సహజీవనంతో హ్యాపీ

నయనతార సహజీవనంతో హ్యాపీ

ఎవరితో ప్రేమలో పడినా కానీ దానిని దాచకుండా ప్రపంచానికి తెలియజెప్పిన సౌత్‌ హీరోయిన్‌ అంటూ వుంటే నయనతార మాత్రమే. శింబు, ప్రభుదేవాలతో తన ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టలేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు విఘ్నేష్‌తో నడుస్తోన్నది కూడా దాచలేదు. కాకపోతే ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లిన నయనతార ప్రస్తుతం అలాంటి ఆలోచన చేయడం లేదు. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపినపుడు నయనతారకి అవకాశాలు తగ్గిపోయాయి. రేపో, మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందనే భయంతో నిర్మాతలు ఆమెని అప్రోచ్‌ అవలేదు.

అలాంటి పరిస్థితుల్లో మళ్లీ కెరియర్‌ నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. కానీ నయనతారకి అదృష్టం కొద్దీ మంచి సినిమాలు పడి తిరిగి తమిళనాడులో స్టార్‌ స్టేటస్‌ దక్కించకుంది. ఆ అనుభవంతోనేనేమో ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి నయనతార తొందర పడడం లేదు. అతనితో సహజీవనం అయితే చేస్తోంది కానీ కమిట్‌మెంట్‌కి సిద్ధ పడడం లేదు. గతంలో జరిగిన అనుభవాలతో నయనతారకి జాగ్రత్త పెరిగినట్టుంది. ఇతను తనతో జీవితాంతం వుంటాడనే నమ్మకం కలిగే వరకు ఇక ఈ దర్శకుడితో మూడు ముళ్లు వేయించుకోదేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు