చైతూ-సమంత రిసెప్షన్ ఎక్కడంటే..

చైతూ-సమంత రిసెప్షన్ ఎక్కడంటే..

అక్కినేని చిన్నోడు అఖిల్ పెళ్లి ఎప్పుడో.. ఎక్కడో తేలిపోయింది. కానీ పెద్దోడు నాగచైతన్య సంగతే ఇంకా క్లారిటీ రాలేదు. ఆగస్టులో పెళ్లంటున్నారు. కానీ డేట్ ఇంకా ఫిక్సవ్వలేదు. వెన్యూ విషయంలోనూ క్లారిటీ లేదు. హిందూ.. క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లంటున్నారు కానీ.. ఏది ముందు ఏది వెనుక.. ఏది ఎక్కడ అన్నది స్పష్టత లేదు. ఐతే పెళ్లి సంగతి ఏమో కానీ.. నాగచైతన్యతో తన రిసెప్షన్ ఎక్కడో మాత్రం సమంత చెప్పేసింది. ఇంతకీ ఆ వేదిక ఏది అంటారా.. సమంత క్లోజ్ ఫ్రెండ్స్ నీరజ కోన, నితిన్ కలిసి మొదలుపెట్టిన ‘టి గ్రిల్’ రెస్టారెంటులోనట. నిన్న సమంత స్వయంగా ఈ రెస్టారెంటును ఆరంభించిన సంగతి తెలిసిందే.

అనంతరం మీడియా వాళ్ల నుంచి తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవడం ఆలస్యం.. సమంత తనదైన శైలిలో స్పందించింది. ఇంకా నా పెళ్లి గురించి అడగలేదేంటా అనుకుంటున్నా.. అడిగేశారా అంటూ.. పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా డిసైడవ్వలేదని.. ఐతే రిసెప్షన్ మాత్రం నితిన్-నీరజల రెస్టారెంట్లోనే జరుగుతుంది అనేసింది. బహశా సరదాకే సమంత ఈ మాట అందేమో. అక్కినేని వాళ్ల పెళ్లి రిసెప్షన్ అంటే ఇంకా పెద్ద పెద్ద వేదికలే దొరుకుతాయి కదా. స్వయంగా నాగార్జునకే ‘ఎన్’ కన్వెన్షన్ కూడా ఉంది. అవన్నీ వదిలేసి.. ఇప్పుడే మొదలైన రెస్టారెంట్లో రిసెప్షన్ చేస్తారా...? సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా సమంత ట్రోలింగ్ మామూలుగా లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు