ఆ లెజెండ్.. మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు

ఆ లెజెండ్.. మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు

రాజీవ్ మీనన్.. సౌత్ ఇండియన్ సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘బొంబాయి’ సినిమాతో ఈ లెజెండరీ కెమెరామన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత కూడా మణిరత్నం సినిమాలు గురు.. కడలి లాంటి వాటికి ఛాయాగ్రహణం అందించాడు. కెమెరామన్‌గా ఎలాంటి ముద్ర వేశాడో.. దర్శకుడిగానూ అలాగే తన ప్రత్యేకతను చాటుకున్నాడు రాజీవ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెరుపు కలలు’ ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు కొల్లగొట్టింది. రెండో సినిమా ‘ప్రియురాలు పిలిచింది’ కూడా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమానే. కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. క్రిటికల్‌గా చాలా అప్రిసియేషన్ వచ్చింది ఈ సినిమాలకు.

ఐతే ఎందుకో కానీ.. ఆ తర్వాత  మెగా ఫోన్‌కు దూరమైపోయాడు రాజీవ్. సినిమాటోగ్రాఫర్‌గా కూడా సినిమాలు బాగా తగ్గించేశాడు. ఐతే 15 ఏళ్ల తర్వాత ఈ లెజెండ్ మళ్లీ దర్శకత్వం చేయబోతున్నాడు. రెహమాన్ మేనల్లుడు.. మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పేరు.. సర్వం తాలమయం. రాజీవ్ తొలి రెండు సినిమాల్లో లాగే ఈ చిత్రానికి కూడా రెహమానే సంగీతం అందిస్తున్నాడు. నటుడిగా మారాక జి.వి. చాలా వరకు అల్లరి చిల్లరి సినిమాలే చేశాడు. అతడి స్టయిల్‌కు.. రాజీవ్ శైలికి అస్సలు మ్యాచ్ కాదు. అయినా తన రీఎంట్రీ మూవీకి జి.వి.నే హీరోగా ఎంచుకున్నాడంటే.. అతడిలో ఏదో కొత్తగా చూశాడన్నమాటే. ఈ సినిమాలో జి.వి. సరికొత్తగా కనిపిస్తాడనంలో సందేహంలేదు. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు