లెక్చరర్ దర్శకత్వంలో నాని

లెక్చరర్ దర్శకత్వంలో నాని

ఆల్రెడీ ఈ ఏడాది నాని సినిమాలు మూడు రిలీజయ్యాయి. ఆ మూడూ హిట్టయ్యాయి కూడా. ఈ ఏడాది ఆఖర్లో నాని నాలుగో సినిమా 'నేను లోకల్' కూడా విడుదల కాబోతోంది. 'మజ్ను' లాగే ఈ సినిమాను మొదలుపెట్టిన నాలుగు నెలలకే రిలీజ్ చేసేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమా ఫినిషింగ్ స్టేజ్లో ఉండగానే నాని తన తర్వాతి సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. ఈ నెల 23న నాని కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ చిత్రంతో శివ శంకర్ లాలం అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. 'ఎవడే సుబ్రమణ్యం' తర్వాత నాని మళ్లీ ఓ కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఇదే.

విశేషం ఏంటంటే.. శివశంకర్ టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాడు. సుకుమార్ లాగే అతను కూడా లెక్చరర్గా పని చేసి.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశాడు. నాని-శివ శంకర్ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. రైటర్ కోన వెంకట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. 'జెంటిల్మన్' సినిమాలో నానికి దీటుగా నటించి మెప్పించిన నివేదా థామసే ఇందులోనూ కథానాయికగా నటించనుంది. 'సరైనోడు'తో తెలుగులో తొలి హిట్ అందుకున్న ఆది పిని శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడిది నెగెటివ్ రోలా కాదా అన్నది తెలియడం లేదు. ఈ చిత్రం చాలా వరకు ఫారిన్లోనే షూటింగ్ జరుపుకుంటుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English