‘ఈనాడు’ ద‌ర్శ‌కుడితో న‌య‌న‌తార‌

‘ఈనాడు’ ద‌ర్శ‌కుడితో న‌య‌న‌తార‌

కోలీవుడ్లో ఒక ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్లో సినిమా మొద‌లైంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా తొలిసారి నిర్మాత‌గా మారుతూ సినిమాను ప్ర‌క‌టించాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కావ‌డం విశేషం. ఇందులో న‌య‌న‌తార క‌థానాయిక‌గా ఎంపికైంది. ‘సాగ‌ర సంగ‌మం’ సినిమాలో బాల న‌టుడిగా న‌టించి.. ఆ త‌ర్వాత కొన్నేళ్ల కింద‌ట క‌మ‌ల్ హాస‌న్ సినిమా ‘ఈనాడు’తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చ‌క్రి తోలేటి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతుండ‌టం విశేషం. ‘కోలైయుదిర్ కాల‌మ్’ పేరుతో తెర‌కెక్కనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ నిర్మాత వ‌శు భగ్నాని కూడా నిర్మాణ భాగ‌స్వామి కావ‌డం విశేషం.ఈ సినిమా హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ అట‌.

ఈ ఏడాది న‌య‌న్ న‌టించిన హార్ర‌ర్ మూవీ ‘మాయ’ సూప‌ర్ హిట్ట‌యింది. దీంతో కోలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఊపొచ్చింది. చ‌క్రి తోలేటి ‘ఈనాడు’ త‌ర్వాత అజిత్ హీరోగా ‘బిల్లా-2’ తీశాడు. తొలి రెండు సినిమాలూ అత‌డికి నిరాశ‌నే మిగిల్చాయి. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని త‌న మూడో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు చ‌క్రి. ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజానే సంగీతం అందించ‌నున్నాడు. న‌య‌న్ హీరోయిన్ అంటే ఆటోమేటిగ్గా ఈ సినిమా తెలుగులోనూ రిలీజ‌వుతుంది. మ‌రి చ‌క్రి ఈసారైనా స‌క్సెస్ అందుకుంటాడా.. నిర్మాత‌గా యువ‌న్‌కు శుభారంభం ల‌భిస్తుందా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు వ‌చ్చే ఏడాది వేస‌విలో స‌మాధానాలు ల‌భిస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు