దర్శకుడి మాట.. 30 శాతం కలెక్షన్లు లాస్

దర్శకుడి మాట.. 30 శాతం కలెక్షన్లు లాస్

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సినిమా కలెక్షన్లపై బాగా ప్రభావం చూపిస్తున్న తరుణంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో కొంచెం టెన్షన్‌గానే ఉందని.. ఐతే సినిమా వచ్చే సమయానికి పరిస్థితులు సర్దుకుంటాయని.. మంచి సినిమాను అందిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలమని అనుకుంటున్నామని నిఖిల్ చెప్పాడు. కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్ లేకపోవడం.. కొన్నిసార్లు హీరోయిన్ల కోసం ఎదురు చూడటం వల్ల ఈ సినిమా ఆలస్యమైందని.. ఐతే సినిమా విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదని నిఖిల్ వెల్లడించాడు. ప్రస్తుతం చేస్తున్న సుధీర్ వర్మ సినిమా పూర్తయ్యాక చందూ మొండేటితో మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు నిఖిల్ తెలిపాడు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తెలుగులో తొలి దెబ్బ తిన్న సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ‘ప్రేమమ్’ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య నటించిన సినిమా అయినా దీనికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దీనికి కారణం పెద్ద నోట్ల రద్దే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ ప్రమాదం తెలిసి వేరే సినిమాల్ని వాయిదా వేసేయగా.. ‘సాహసం..’ను మాత్రం యధావిధిగా విడుదల చేసేశారు.

మరి అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారని దర్శకుడు గౌతమ్ మీనన్ ను అడగ్గా.. ‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టడానికి లేదు. నల్లధనాన్ని తరిమేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. అయితే మేం ముందే మా సినిమా విడుదల తేదీని ప్రకటించేశాం. అప్పటికే అన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే సినిమా కొన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో మళ్లీ వాయిదా వేస్తే బాగోదని చెప్పిన తేదీకే వచ్చేశాం. పెద్ద నోట్ల రద్దు వల్ల మా సినిమాకు 30 శాతం కలెక్షన్లు తగ్గాయి. ఐతే కొత్త సినిమాల రిలీజులు తగ్గడం.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం వల్ల ఇంకో మూడు వారాలు సినిమా థియేటర్లలోనే ఉంటుంది కాబట్టి ఓవరాల్ కలెక్షన్లు బాగానే ఉంటాయన్న నమ్మకముంది’’ అని గౌతమ్ చెప్పాడు.

ఇక ఈ సినిమా ఇంత ఆలస్యం కావడంపై గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు వెర్షన్ విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. తెలుగులో ఎప్పుడో ఫస్ట్ కాపీతో సహా అంతా రెడీ అయిపోయింది. తమిళ వర్షన్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో చైతూ ‘ప్రేమమ్’ మొదలుపెట్టడం.. రిలీజవ్వడం జరిగిపోయాయి. ఇంత లేటైనా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం మరిచిపోలేని విషయం’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు