గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగార్జున?

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగార్జున?

ఆ మధ్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తన కొడుకుతో రెండు సినిమాలు చేసిన గౌతమ్ మీనన్ తనతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయకపోవడంపై అతణ్ని క్వశ్చన్ చేశాడు. ఇది అన్యాయం అన్నాడు. తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చి.. అది నిలబెట్టుకోలేదని గౌతమ్ మీనన్‌ను నిష్టూరమాడాడు. ఐతే ఇప్పుడు గౌతమే స్వయంగా నాగార్జునతో సినిమా చేస్తానంటున్నాడు. నాగార్జున కోసం ఓ కథ తన మదిలో ఉందని.. అది నాగార్జునకు నచ్చుతుందని అనుకుంటున్నానని.. ఏదో ఒక రోజు ఆయనతో సినిమా ఉంటుందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ వెల్లడించాడు.

ఇంకా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో చాలామంది హీరోలతో చేయాలని ఉంది. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్.. వీళ్లందరితోనూ సినిమాలు చేయాలనుకుంటున్నా. నిజానికి వీళ్లందరితోనూ నేను టచ్‌లో ఉన్నాను. నాగార్జున సార్ కోసం ఒక కథ కూడా అనుకున్నా. ఆయనకు అది నచ్చుతుందనుకుంటున్నా. ప్రస్తుతానికి ధనుష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత విక్రమ్ హీరోగా ఒక రొమాంటిక్ మూవీ చేయాలి. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో ఒక సినిమా చేయబోతున్నా. ప్రస్తుతం దానికి సంబంధించి వర్క్ జరుగుతోంది. నాగచైతన్యతోనూ ఇంకో సినిమా చేసే ఉద్దేశం ఉంది’’ అని గౌతమ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు