త్రివిక్రమ్ స్టోరీ.. నితిన్ హీరో

త్రివిక్రమ్ స్టోరీ.. నితిన్ హీరో

యంగ్ హీరో నితిన్.. ట్విట్టర్ జనాలందరినీ సస్పెన్సులో పెట్టేశాడు. నా నుంచి ఓ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతోంది అంటూ.. అందరిలో ఆసక్తి రేకెత్తించాడు. ఐతే తన ట్వీట్ చూసి.. జనాల్లో మరో రకమైన ఆలోచన వచ్చేస్తుందేమో అని.. వెంటనే అప్రమత్తం అయిపోయాడు. ఆ న్యూస్ తన పెళ్లి గురించి కాదని ముందే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ నితిన్ చెప్పే ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటా అని జనాల్లో చర్చ మొదలైపోయింది.

నితిన్ తాను చేయబోయే ఓ క్రేజీ ప్రాజెక్టు గురించి సమాచారం ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ కథతో.. నితిన్ సినిమా చేయబోతున్నాడంటూ సోషల్.. వెబ్ మీడియాల్లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడట. ఇదే కనుక నిజమైతే.. అది సెన్సేషనల్ న్యూసే. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూడాలి.

మరోవైపు నితిన్ తన ఫ్రెండ్..  అయిన స్టైలిస్ట్ నీరజ కోనతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టబోతున్నాడు. ‘టి గ్రిల్’ పేరుతో వీళ్లిద్దరూ కలిసి రెస్టారెంట్ ఆరంభించబోతున్నారు. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో ఈ రెస్టారెంట్ త్వరలోనే ఆరంభం కాబోతోంది. ఈ విషయాన్ని కూడా నితిన్ ప్రకటించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు