గొడవల్లేవు.. చైతూతో మళ్లీ అంటున్నాడు

గొడవల్లేవు.. చైతూతో మళ్లీ అంటున్నాడు

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలకు ముందు.. తర్వాత దాని ఊసే ఎత్తట్లేదు గౌతమ్ మీనన్. ఓవైపు దీని తమిళ వెర్షన్ను ప్రమోట్ చేస్తున్నాడు కానీ.. తెలుగు వెర్షన్ గురించి ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు. రెండు నెలల కిందట ప్రేమమ్కు పోటీగా 'సాహసం.. రిలీజ్ డేట్ ప్రకటించిన టైంలో గౌతమ్కు, చైతూకు వాగ్వాదం జరిగిందని.. పైగా ఈ సినిమాను ఏడాదిగా వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంపై చైతూ అసహనానికి గురయ్యాడని ఊహాగానాలు వచ్చాయి. 'సాహసం..' రిలీజయ్యాక దీని గురించి గౌతమ్ మాట్లాడకపోవడంతో ఈ ఊహాగానాలే నిజమన్న అభిప్రాయం కలిగింది జనాల్లో. ఐతే ఎట్టకేలకు గౌతమ్ ఈ సినిమా గురించి స్పందించాడు. రూమర్లన్నింటికీ తెరదించాడు. చైతూతో విభేదాలు లేవని.. అతడితో ఇంకో సినిమా కూడా చేస్తానని ప్రకటించాడు.

''ఏమాయ చేసావె సమయానికి ఇప్పటికి వ్యక్తిగా చైతూలో మార్పు ఏమీ లేదు. సరదాగా తమ్ముడిలా ఉంటాడు. అతడ్ని డైరెక్ట్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్కు రెడీ అయినా.. తమిళ వర్షన్ వల్ల ఆలస్యమవుతున్నా ఓపికగా ఉన్నాడు. హీరోగా ప్రస్తుతం చైతన్య స్థాయి పెరిగింది. 'సాహసం..' షూటింగ్ టైంలో ఈ సినిమా తర్వాత అతను మాస్ సినిమాలు కూడా చేయొచ్చు అనేవాడిని. ఇప్పుడు నిజంగానే మాస్ హీరో అవ్వగలిగే లుక్, స్టేటస్ చైతూ తెచ్చుకున్నాడు. చైతూతో నాకు మంచి రిలేషన్ ఉంది. నేనైతే అతడితో ఇంకో సినిమా చేయడానికైనా రెడీ, చైతూకి ఆ ఫీలింగ్ ఉందో లేదో మరి'' అని గౌతమ్ అన్నాడు. అంతా బాగుంది కానీ.. చివర్లో చైతూకు ఆ ఫీలింగ్ ఉందో లేదో మరి అనడంలోనే డౌట్లు కొట్టేస్తున్నాయ్!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు