బిక్కచచ్చిపోయిన తెలుగు సినీ పెద్దలు!

బిక్కచచ్చిపోయిన తెలుగు సినీ పెద్దలు!

మోడీ ఇచ్చిన షాక్‌కి రాజకీయ నాయలకులైతే ఏదో విధంగా తమ ఆవేదనని పబ్లిక్‌లో చెప్పుకుంటున్నారు కానీ సడన్‌గా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నో కోట్ల రూపాయల నల్ల ధనం ఏమి చేసుకోవాలో తెలియని సెలబ్రిటీలు కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా మంది సినిమా వాళ్ల దగ్గర నల్ల డబ్బు కోట్లలోనే వుందట. ఎంతగా వేరే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ క్యాష్‌ రూపంలో డబ్బు వుండడం అనేది కామనే కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు అంతా వృధా పోయినందుకు దిగులు పడుతున్నారట. అయితే లోపల ఎంత బాధ వున్నా మోడీని పొగుడుతూ మాట్లాడకపోతే తమని అవినీతిపరులు అనేస్తారనే భయంతో ఎవరికి వారే ఇష్టమున్నా, లేకపోయినా ప్రధాని నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతున్నారు.

కొంత డబ్బుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వైట్‌ చేసుకున్నా కానీ ఖచ్చితంగా చాలా మంది ఈ వెయ్యి, అయిదొందల నోట్ల రద్దుతో నష్టపోయారని భోగట్టా. ఇంతకాలం సగం వైట్‌, సగం బ్లాక్‌ అన్నట్టు జరిగిన లావాదేవీలు ఇక పూర్తిగా వైట్‌లో జరగాలంటే కష్టమే మరి. ఎంత అడిగితే అంత ఇచ్చేసిన నిర్మాతలు ఇకపై గీసి, గీసి బేరాలాడతారు. సినిమా పోయిందంటే నష్టంలో వాటా తీసుకోమంటూ ఇంటి బయట తిష్ట వేస్తారు. ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోయి పెంచేసిన తెలుగు సినిమా మార్కెట్‌ సగానికి పడిపోతుందని ట్రేడ్‌ వాళ్లు భయపెడుతున్నారు. ఎలా చూసినా ఇకపై సినిమా వాళ్లకీ, సినిమాకీ గడ్డు కాలమే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు