టాలీవుడ్ కు డాలర్ కష్టాలు

టాలీవుడ్ కు డాలర్ కష్టాలు

డాలర్ కష్టాలు టాలీవుడ్ ను తాకుతున్నాయి.  రూపాయి కష్టాలు ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, రామ్ తదితర హీరోల సినిమాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’, మహేష్ బాబు తో ‘వన్’, వెంకటేష్- రామ్ లతో ‘మసాలా’ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. కథానుసారం వీటి షూటింగ్ లు విదేశాల్లో జరుతుపుతున్నారు. సాధారణంగానే మన సినిమాలకు కనీసం 10శాతం షూటింగ్ విదేశాల్లో జరపడం అలవాటైపోయింది. ఇటీవల మిస్టర్ ఫెరఫెక్ట్, దూకుడు, ఆరెంజ్, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చాలా భాగం విదేశాల్లోనే తయారయ్యాయి. చిన్న కథను కూడా పెద్దది చేసి, విదేశాల్లోకి తీసుకోకపోతే, పెద్ద హీరోల కథలకు హైప్ రాదని టాలీవుడ్ జనాల నమ్మకం.

ఇప్పుడు రూపాయి విలువ పతనం కావడంతో, విదేశాల్లో, షెడ్యుల్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాల ఖర్చు దాదాపు ముఫై శాతానికి పైగా పెరిగిపోయిందని తెలుస్తోంది, అసలే సినిమాలు విడుదల కాక ఇబ్బందుల్లో వున్న టాలీవుడ్ పెద్ద నిర్మాతలు, ఇప్పుడు దీని కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అలా అని చేతిలోని ప్రాజెక్టుల పూర్తి కాకపోయినా ఇబ్బందే.

ఈ  నేపథ్యంలో ఇక కథలను మార్చుకోక తప్పదు. అవసరం వున్నా లేకపోయినా విదేశీ నేపథ్యాలు అల్లే కథలు ఇక కాస్త చల్లారతాయి. ఇక ఢిల్లీ, కాశీ, కలకత్తా నేపథ్యాలు మళ్లీ కనిపించడం మొదలవుతుంది. ఇది కూడా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిదే. నిర్మాత సొమ్ముతూ ఊ అంటే బ్యాంకాక్ మలేషియా, తదితర నగరాలకు పోయి, సోకులు చేసే దర్శకులు, హీరోలు ఇకనైనా వెనక్కు తగ్గుతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు