నాగ చైతన్యకి పూరీతో పడితే ఆల్‌ సెట్‌

నాగ చైతన్యకి పూరీతో పడితే ఆల్‌ సెట్‌

నాగ చైతన్య మంచి నటుడే కానీ బిగుసుకుపోతాడు. తను పని చేసిన దర్శకుల్లో ఒకరిద్దరు మినహా చాలా మంది కొత్తవాళ్లే కావడంతో అతడిని ఎవరూ కరక్ట్‌ చేయలేదు. కానీ నెమ్మదిగా మెరుగుపడుతూ వచ్చిన చైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో క్యాజువల్‌గా నటించాడు. గౌతమ్‌ మీనన్‌తో రెండవసారి కావడం వలనో, అనుభవం పెరగడం వలనో ఇందులోని పాత్రకి న్యాయం చేసాడు. ఇప్పటికీ డైలాగులు చెప్పడంలో కాస్త పట్టి పట్టి మాట్లాడే ధోరణి కనిపిస్తోంది. అతడిలోని ఈజ్‌ పెంచే దర్శకుడితో పని చేస్తే చైతన్య సెట్‌ రైట్‌ అయిపోతాడు. చాలా మంది హీరోలలోని ఈ ధోరణి పోగొట్టి వాళ్లు ఈజీగా నటించడానికి హెల్ప్‌ చేసిన పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో చైతన్య ఒక సినిమా చేయాలి.

ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ ఉన్న ఫామ్‌లో అతనితో పని చేయడం కాస్త రిస్కే కానీ నటుడిగా చైతన్యకి అది ప్లస్‌ అవుతుంది. తన సినిమాలు ఎలాగో బడ్జెట్‌లోనే రూపొందుతాయి కనుక ఆర్థికంగా పూరీతో చేయడం అంత రిస్క్‌ కూడా కాదు. పూరితో ఒక్క సినిమా చేస్తే తన తప్పులు ఏంటనేది చైతన్య తెలుసుకుంటాడు. నిజానికి చైతన్య మొదటి సినిమాకే పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించాల్సింది. కానీ ఎందుకో అది సెట్‌ కాలేదు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేస్తే చైతన్య ఇక నెక్స్‌ట్‌ లీగ్‌కి వెళ్లడం మీద దృష్టి పెట్టేసుకునే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు