'బాహుబలి' పతివ్రత బాసూ!

'బాహుబలి' పతివ్రత బాసూ!

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఎన్నో కోట్ల రూపాయల నల్ల ధనం దొరికిందంటూ మీడియా కోడై కూస్తోంది. రెయిడ్స్‌ జరిగిన విషయంపై కిమ్మనకుండా కూర్చున్న బాహుబలి బృందం ఎప్పటిలా తమ సినిమా ప్రచార పనిలో బిజీగా వుంది. ఇంతకీ నిజంగానే కోట్ల రూపాయలు దొరికాయా? ఒకవేళ దొరికినట్టయితే అదేమైనా బాహుబలి నిర్మాణ పనులకి ఆటంకమవుతుందా? ఇవన్నీ గాలి వార్తలని కొట్టి పారేసారు విజయేంద్రప్రసాద్‌. బాహుబలికి సంబంధించిన ప్రతి వ్యాపార లావాదేవీ నడిచింది చెక్కుల రూపంలోనేనని, ఎవరి దగ్గర క్యాష్‌ తీసుకోలేదని ఆయన తేల్చారు.

మిగిలిన ఇండస్ట్రీ విషయాల గురించి తనకి అవగాహన లేదు కానీ ఈ చిత్రం విషయంలో అన్నీ లెక్కల్లోనే ఉన్నాయని పక్కాగా చెప్పగలనని ఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో రాజమౌళి కూడా ఒకడు కావడంతో, అతని తండ్రికి లెక్కల గురించి ఆమాత్రం తెలిసే ఉండుంటుంది. మరి ఏ గొడవా లేకపోతే ఎందుకని బాహుబలి నిర్మాతల మీద మీడియా బురద జల్లుతోంది? వీళ్ల సక్సెస్‌ని చూడలేని గిట్టని వాళ్లు ఎవరైనా మీడియాకి ఉప్పందిస్తున్నారా లేక బాహుబలి గురించి చెడుగా రాస్తే హిట్స్‌ బాగుంటాయని మీడియానే కల్పించి రాస్తోందా? ఇదంతా హంబక్‌ అంటూ ఒక మాట అనేస్తే పోయేదానికి బాహుబలి నిర్మాతలు, రాజమౌళి ఎందుకని దీనిని పట్టించుకోవడం లేదో ఏమో మరి.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు