బాహుబ‌లి టీం.. ష్ గ‌ప్ చుప్‌!

బాహుబ‌లి టీం.. ష్ గ‌ప్ చుప్‌!

500.. 1000 నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం టాలీవుడ్లో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపింది. మ‌న హీరోలు.. నిర్మాత‌ల ద‌గ్గ‌ర గుట్ట‌లుగా పేరుకుపోయిన నోట్ల క‌ట్ట‌ల్ని ఏం చేస్తారా అని అంతా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. మోడీ స‌ర్కారు ఈ నిర్ణ‌యం వెలువరించిన వెంట‌నే.. త్వ‌ర‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు జ‌రగొచ్చ‌న్న అంచ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. దానికి త‌గ్ట్లట్లే మూడు రోజుల కింద‌ట బాహుబ‌లి నిర్మాతల మీద ఐటీ దాడులు జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం రేపింది. బాహుబ‌లి నిర్మాత‌ల ద‌గ్గ‌ర రూ.60 కోట్ల దాకా న‌గ‌దును ఐటీ అధికారులు సొంతం చేసుకున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. రెండు రోజులుగా టాలీవుడ్లో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌.

ఐతే బాహుబ‌లి టీం మాత్రం ఈ దాడుల విష‌యం ఎక్క‌డా నోరు విప్ప‌ట్లేదు. అస‌లేం జ‌ర‌గ‌న‌ట్లే అంద‌రూ మామూలుగా ఉంటుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఒక‌వేళ దాడుల వార్త అబ‌ద్ధం అయితే.. దాన్ని ఖండించ‌నూ లేదు. దాడులు జ‌రిగిన విష‌యాన్నీ ధ్రువీక‌రించ‌లేదు. నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ ట్విట్ట‌ర్లో బాహుబ‌లి కామిక్ వెర్ష‌న్ గురించి ట్వీట్ చేశాడు. బాహుబ‌లి టీం అంతా బెంగ‌ళూరుకు వెళ్లి అక్క‌డ ఈ కామిక్ వెర్ష‌న్‌కు సంబంధించి ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంది. రాజ‌మౌళి మొన్న మాయాబ‌జార్ రెస్టారెంటుకు వెళ్లి కుటుంబంతో క‌లిసి లంచ్ చేసి వ‌చ్చాడు. మిగ‌తా వాళ్లు కూడా అస‌లేమీ జ‌ర‌గ‌న‌ట్లు సైలెంటుగా ఉన్నారు. మ‌రి దాడులు జ‌రిగిన‌ట్లా.. జ‌ర‌గ‌న‌ట్లే. అటాక్స్ జ‌రిగినా అంద‌రూ ఇంత కూల్‌గా ఉండ‌టం మాత్రం ఆశ్చ‌ర్య‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు