ఆయన హ్యాండు పడిందిగా, ఏలేస్తుందిలే!

ఆయన హ్యాండు పడిందిగా, ఏలేస్తుందిలే!

అందానికి ఏమాత్రం లోటు లేకపోయినా, అందాల ఆరబోతకి అస్సలు అభ్యంతరాలేం పెట్టకపోయినా అదితి రావు హైదారికి బాలీవుడ్‌లో చెప్పుకోతగినన్ని ఆఫర్లు రాలేదు. గురు చిత్రంలో చిన్న పాత్రలో అదితిని తీసుకున్న మణిరత్నం ఈ ముద్దుగుమ్మని దక్షిణాదికి పరిచయం చేయబోతున్నారు.

ఆయన దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న 'డ్యూయట్‌'లో హీరోయిన్‌ అదితినే. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్లకి వుండే ప్రాధాన్యత, వారిని ఆయన చూపించే విధానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో అదితి ఇక్కడ బిజీ అయిపోయి తెలుగు, తమిళ రంగాన్ని ఏలేసినా ఆశ్చర్యం లేదు. అసలే ఒకరిద్దరు మినహా హీరోయిన్లే లేక దక్షిణాది చిత్ర పరిశ్రమ హీరోయిన్ల కొరతతో అల్లాడిపోతోంది. ఓకే బంగారం చిత్రంతో తనలో ప్రేమకథని రక్తి కట్టించే దర్శకుడు ఇంకా అలాగే వున్నాడని మణిరత్నం చాటుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రయోగాలని మానేసి ప్రేమకథకే శ్రీకారం చుట్టారు.

కార్తీకి ప్రస్తుతం తెలుగులో ఫుల్‌ ఫాలోయింగ్‌ వుంది కనుక, మణిరత్నం ఫ్యాక్టర్‌ కలిసి వచ్చి ఈ చిత్రానికి ఓపెనింగ్‌ అదిరిపోతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తోనే దిల్‌ రాజు దీని తెలుగు రైట్స్‌ తీసేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు