ప్రేమ‌మ్.. సాహ‌సం.. ఎంత తేడా?

ప్రేమ‌మ్.. సాహ‌సం.. ఎంత తేడా?

ఒక హీరో ఒక హిట్టు కొట్టాక త‌ర్వాతి సినిమాకు ఆటోమేటిగ్గా ఓపెనింగ్స్ బాగా వ‌స్తాయి. టాక్ బాగుంటే క‌లెక్ష‌న్లు పెరుగుతాయి. కానీ అక్కినేని నాగ‌చైత‌న్య కొత్త సినిమా ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ విష‌యంలో అలా జ‌ర‌గ‌ట్లేదు. ‘ప్రేమ‌మ్’ లాంటి మంచి హిట్టు త‌ర్వాత అత‌డి నుంచి వ‌చ్చిన సినిమా అయినా ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’కు చాలా నిరాశాజ‌న‌క‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ద‌స‌రా స‌మ‌యంలో తీవ్ర‌మైన పోటీ మ‌ధ్య వ‌చ్చిన‌ప్ప‌టికీ ‘ప్రేమ‌మ్’  సినిమాకు తొలి రోజు రూ.3.5 కోట్ల షేర్.. రూ.5.7 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. కానీ ఈ శుక్ర‌వారం సోలోగా రిలీజైన ‘సాహ‌సం..’ తొలి రోజు రూ.2 కోట్ల షేర్.. రూ.3.9 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌సూలు చేసింది.

టాక్ బాగానే ఉన్నా ‘సాహ‌సం..’ క‌లెక్ష‌న్లు ఇలా ఉండ‌టానికి ఇందుకు ప్రధాన కారణం 500.. 1000 నోట్ల రద్దు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెగ్యులర్‌గా సినిమాలు చూసే జనాల దగ్గర వంద నోట్లు చాలినన్ని అందుబాటులో లేకపోవడంతో థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. హైద‌రాబాద్ సిటీలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు తీసుకుని ప్రేక్ష‌కులు సినిమా చూడ్డం వ‌ల్ల నైజాం  ఏరియా క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నాయి కానీ.. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో క‌లెక్ష‌న్లు బాగా దెబ్బ తిన్నాయి. నైజాంలో తొలి రోజు రూ.75 ల‌క్ష‌ల షేర్ రాగా.. సీడెడ్లో కేవ‌లం రూ.16 ల‌క్ష‌లే వ‌చ్చింది. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ క‌లిపి రూ.50 ల‌క్ష‌ల షేర్ వ‌సూలైందంతే. చూస్తుంటే ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ నిర్మాత‌కు భారీ న‌ష్టాన్నే మిగిల్చేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English