ఇలియానాని వాడుకోండెహే!

ఇలియానాని వాడుకోండెహే!

ఇలియానా గ్లామర్‌ షో గురించి, ఆమె సెక్సీ ఇమేజ్‌ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి తెలియనిది కాదు. అయితే బాలీవుడ్‌ మీద మోజుతో ఇక్కడి అగ్ర స్థానాన్ని సైతం వదులుకుని వెళ్లిపోయిన ఇలియానా అక్కడ చెప్పుకోతగిన సినిమాలే చేసింది కానీ ఇక్కడ అయినంత సంచలనం అయితే కాలేకపోయింది. బాలీవుడ్‌లో ఇలియానాని గ్లామరస్‌గా చూపించిన సినిమాలు చాలా తక్కువ. ఎక్కువగా ఆమెతో పర్‌ఫార్మెన్స్‌ ప్రధాన పాత్రలే చేయించారు. దీంతో ఇలియానాకి తన హాట్‌ యాంగిల్‌ చూపించే ఛాన్స్‌ చిక్కలేదు. తనేమి చేయగలదో చూపిస్తూ కొన్ని హాట్‌ ఫోటోషూట్లు చేసినా కానీ బాలీవుడ్‌ ఆమెని ఆ దృష్టిలో చూడలేదు.

ఇప్పుడు తన పర్సనల్‌ ఆల్బమ్‌లోంచి వీడియోలు, ఫోటోలు పెడుతూ ఇంటర్నెట్‌లో ఇలియానా హల్‌చల్‌ చేస్తోంది. ఆ అందాన్ని కెమెరాలో బంధిస్తూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రచ్చ చేస్తోంటే, ఆ ఫోటోలన్నీ ఇలియానా ఇంటర్నెట్‌లో పెడుతూ ఫాన్స్‌కి కనువిందు చేస్తోంది. కనీసం ఇది చూసి అయినా ఇలియానాకి తగిన పాత్రలిచ్చి బాలీవుడ్‌ ఆమె అందానికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి. ఎంత కాదన్నా బాలీవుడ్‌ వాళ్లకి సౌత్‌ నుంచి వచ్చిన హీరోయిన్లంటే చిన్నచూపే. అందుకే కాజల్‌, శ్రియలాంటి సెక్సీ హీరోయిన్లు సైతం అక్కడ స్ట్రగుల్‌ అవ్వాల్సి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు