సాహసం శ్వాసగా... ఆశలు వదిలేసుకున్నారా?

సాహసం శ్వాసగా... ఆశలు వదిలేసుకున్నారా?

అయిదొందలు, వెయ్యి నోట్ల నిషేధం వల్ల ప్రస్తుతం మార్కెట్లో డబ్బు లేదు. ఉన్న ఆ కొద్ది చెల్లుబాటయ్యే డబ్బునే జనం పదిలంగా వాడుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో విందు, వినోదాల మీదకి జనం దృష్టి మళ్లడం లేదు. ఈ కారణంగానే మాల్స్‌, సినిమా హాల్స్‌, రెస్టారెంట్స్‌ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మరో వారం వరకు కొనసాగుతుందనే అంచనాలుండడంతో కొత్త సినిమాలు విడుదల చేయడానికి ఇది అనువైన సమయం కాదని చాలా మంది వెనక్కి తగ్గారు. అయితే సాహసం శ్వాసగా సాగిపో నిర్మాతలు మాత్రం సాహసానికి దిగుతున్నారు. ఇప్పటికే చాలా లేట్‌ అయిన ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయకూడదని అనుకున్నారో ఏమిటో కానీ కొత్త సినిమా విడుదలకి అనుకూలంగా లేని ఈ టైమ్‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.

దీని వల్ల ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లు ఆగి ఇలాంటి రిస్కీ టైమ్‌లో ఎందుకని విడుదల చేస్తున్నారంటూ ఆశ్చర్యపోతున్నవాళ్లూ వున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో ఈ చిత్రం చాలా స్ట్రగుల్‌ అవుతుందని ట్రేడ్‌ కలవరపడుతోన్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఆడుతుందనేది సర్వత్రా ఆసక్తికరమైంది. ఇది మిస్‌ఫైర్‌ అయితే మిగతా వాళ్లు ఇంకా జాగ్రత్త పడతారు. ఇది కానీ క్లిక్కయితే మిగతా వాళ్లు భయం లేకుండా తమ చిత్రాలు రిలీజ్‌ చేస్తారు. మొత్తానికి ఇదో ఎక్స్‌పెరిమోంట్‌గా తయారైందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు