గోపీచంద్.. ఆ సినిమాను గాలికొదిలేయలేదు

గోపీచంద్.. ఆ సినిమాను గాలికొదిలేయలేదు

'నీ మనసు నాకు తెలుసు' అంటూ దశాబ్దం కిందట ఓ క్రేజీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ. కానీ తొలి సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. రత్నం మునిగిపోవడానికి అతను కూడా ఓ కారణమే. ఐతే రత్నం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి కొంచెం కోలుకున్నాక మళ్లీ మెగా ఫోన్ పట్టి గోపీచంద్ హీరోగా 'ఆక్సిజన్' అనే సినిమాను అనౌన్స్ చేశాడు జ్యోతికృష్ణ. ఈ టైటిల్.. ఆ సినిమా లోగో ఆకర్షణీయంగా అనిపించడంతో సినిమా మీద కూడా ఆసక్తి కలిగింది. షూటింగ్ కూడా చకచకా కానిచ్చేసి.. ఫస్ట్ లుక్ కూడా వేగంగానే రిలీజ్ చేశాడు జ్యోతికృష్ణ.

ఇక త్వరలోనే విడుదల అనుకుంటుండగా కొన్ని నెలల కిందట అనూహ్యంగా ఈ సినిమాకు బ్రేక్ పడిపోయింది. కొన్ని సన్నివేశాల విషయంలో గోపీచంద్‌కు, జ్యోతికృష్ణకు అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. మూడు నెలలుగా ఈ సినిమా అసలు వార్తల్లోనే లేదు. గోపీచందేమో సడెన్‌గా సంపత్ నంది సినిమాలోకి వెళ్లిపోయాడు. దీంతో 'ఆక్సిజన్' ఏమవుతుందో అని అంతా అనుకున్నారు. ఐతే ఈ మధ్యే గోపీ, జ్యోతి కలిసి మాట్లాడుకుని అభిప్రాయ భేదాల్ని పరిష్కరించుకున్నారు. షూటింగ్ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ తీస్తున్నట్లు నిర్మాత రత్నం తెలిపాడు. ఇది కాక రెండు పాటలు తీస్తే సినిమా అయిపోతుందట. డిసెంబర్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు